ఆన్-రోడ్ లేదా ఆఫ్-రోడ్ ఛాయిస్ మీదే: హీరో ఇంపల్స్

Hero Impulse
హీరో ఇంపల్స్ బైక్‌‌ను హోండా ఎన్ఎక్స్ఆర్ బ్రాస్ అనే ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ ఆధారంగా రూపొందించారు. హోండాతో హీరో మోటోకార్ప్ కంపెనీకు 2014 వరకూ ఉన్న టెక్నాలజీ ఒప్పందం ద్వారా హీరో ఇంపల్స్ బైక్‌కు సాంకేతిక తోడ్పాటును ఆ హోండానే అందిస్తుందని కంపెనీ తెలిపింది. హీరో ఇంపల్స్ బైక్ ద్వారా భారత టూ-వీలర్ సెగ్మెంట్లో ఓ కొత్త విభాగాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నామని కంపెనీ పేర్కొంది.

ఇటు నగర రోడ్లపై, అటు గ్రామీణ ప్రాంత రోడ్లపై సమర్థవంతంగా పరుగులు తీసేలా హీరో ఇంపల్స్ బైక్‌ను రూపొంగించారు. ఇది రోజూవారీ ప్రయాణం కోసం మాత్రమే కాకుండా.. కొండలు, లోయలు, మట్టి రోడ్లపై ఆఫ్-రోడ్ బైకింగ్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుత పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో హీరో మోటోకార్ప్ తమ ఇంపల్స్ బైక్‌ను అధికారికంగా మార్కెట్‌కు పరిచయం చేసింది.

హీరో ఇంపల్స్ 150సీసీ బైక్ సెగ్మెంట్లో తక్కువ ధరను కలిగి ఉండటమే కాకుండా దీని విశిష్టమైన లుక్ బైక్ ప్రియులను ఇట్టే ఆకట్టుకుంది. ఇందులో నైట్రాక్స్‌ను నింపిన మోనో షాక్‌ రియర్ (వెనుక) సస్పెన్షన్‌, సాధారణ బైక్ కన్నా అధనపు గ్రౌండ్‌ క్లియరెన్స్‌, ముందు వైపు డిస్క్‌ బ్రేక్స్‌ వంటి ఫీచర్లు హీరో ఇంపల్స్ బైక్ సొంతి. ఇది బ్లాక్‌, వైబ్రాంట్ బ్లూ మెటాలిక్‌, స్పోర్ట్స్‌ రెడ్‌, లీఫ్‌ గ్రీన్‌ మెటాలిక్, వైబ్రాంట్‌ ఆరంజ్‌ రంగుల్లో లభ్యం అవుతుంది.

ఈ ఏడాది ఆగస్టు నెలలో హీరో మోటోకార్ప్ తమ లోగో ఆవిష్కరణ సందర్భంగా తొలిసారిగా ఈ బైక్‌ను ప్రదర్శించింది. దీనితో పాటు ఓ 110సీసీ స్కూటర్ హీరో మాస్ట్రోను కూడా అదే రోజున ఆవిష్కరించింది. అయితే ఈ మాస్ట్రో స్కూటర్‌ను ఎప్పుడు దేశీయ మార్కెట్లో విడుదల చేస్తామనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. భారత మార్కెట్లో హీరో ఇంపల్స్ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ ధర రూ.66,800 గా ఉంది.

త్వరలోనే ఈ బైక్ కోసం వివిధ నగరాల్లో టెస్ట్ రైడ్స్‌ని నిర్వహిస్తామని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ 150 సీసీ విభాగంలో ఎచీవర్, సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్, హంక్ మోటార్‌సైకిళ్లను అందిస్తోంది. కాగా.. తమ కొత్త హీరో ఇంపల్స్‌ బైక్‌ను ప్రమోట్ చేయడానికి ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ క్రికెట్ సీరిస్‌ను వేదికగా మలచుకోవాలని హీరో మోటోకార్ప్ యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 18, 2011, 10:35 [IST]
English summary
Hero MotoCorp will soon start selling its first 'Hero' branded bike Hero Impulse. This Bike can be used for both normal commuting as well as off-road adventure. Hero Impulse produces a maximum power of 13.2 Ps at the rate of 7,500 rpm with a torque of 13.40 Nm at the rate of 5,000 rpm.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+