ఇంపల్స్ 150సీసీ బైక్‌ను విడుదల చేసిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ బ్రాండ్‌ను ఇష్టపడేవారికి ఇది నిజంగానే తీపి వార్త. 150సీసీ ఇంపల్స్ బైక్ కోసం గడచిన రెండు నెలలుగా ఎదురుచూస్తున్న వారి కల ఇకపై నెరవేరనుంది. భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) గడచిన ఆగస్టు నెలలో తన పేరును మార్చుకున్న సందర్భంగా పరిచయం చేసిన ఆన్-రోడ్/ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ 'హీరో ఇంపల్స్'ను దేశీయ విపణిలోకి విడుదల చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

జపాన్ భాగస్వామి (హోండా) నుండి విడిపోయి, హీరో మోటోకార్ప్‌గా పేరు మార్చుకున్న తర్వాత హీరో బ్రాండింగ్‌పై వస్తున్న తొలి బైక్ 'హీరో ఇంపల్స్' అని కంపెనీ వెల్లడించింది. హీరో బ్రాండ్‌తో వస్తున్న ఈ బైక్ ధరను రూ.66,800 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని హీరో మోటోకార్ప్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా తెలిపారు.

హీరో ఇంపల్స్ మోటార్‌సైకిళ్లను ఇప్పటికే కొందరు డీలర్లకు పంపించామని, అతి త్వరలో మెట్రో నగరాలు, టైర్-1 పట్ణాల్లో ఈ మోడల్ అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు. హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్ 150 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 13.8 బిహెచ్‌పిల శక్తిని, 13.6 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

హీరో ఇంపల్స్ గురించి మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 18, 2011, 10:38 [IST]
English summary
The country's largest two-wheeler maker Hero MotoCorp (formerly known as Hero Honda) has launched its first 150cc dual purpose motorcycle Hero Impulse in Indian Market with a price tag of Rs 66,800 (ex-showroom Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+