యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది

ABS in Bikes
సాదారణ బ్రేకింగ్ సిస్టమ్ (డ్రమ్/డిస్క్)లో రోడ్డుపై అత్యవసరంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితుల్లో బ్రేక్ వేసినప్పుడు టైర్లు తిరిగడం (టైర్ రోలింగ్) ఆగిపోయి టైర్లు రోడ్డపై రాచుకుంటూ, బ్రేకింగ్ దూరం పెరిగి వాహనం జారిపోయే ఆస్కారం ఉంది. అయితే, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌లో అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ వేసినప్పుడు టైర్లు తిరగడం ఆగిపోకుండానే వాహన వేగాన్ని పూర్తిగా నియంత్రించి, బ్రేకింగ్ దూరాన్ని (బ్రేకింగ్ డిస్టాన్స్) తగ్గించి ప్రమాదం నుండి తప్పించుకోవడం జరుగుతుంది.

వాస్తవానికి ఏబిఎస్ అనేది కొన్ని దేశాల్లో అయితే వాహనాల్లో ఒక స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తుంది. కానీ మన దేశంలో దీనిపై ఎలాంటి నిబంధనలు లేవు కాబట్టి ఇది అంతగా ప్రాచుర్యం పొందలేక పోయింది. ఇప్పుడు మన దేశంలో ఏబిస్‌తో లభిస్తున్న మోటార్‌సైకిళ్లు రెండు మాత్రమే. అందులో ఒకటి టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 180 ఏబిఎస్ మరొకటి హోండా సిబిఆర్ 250ఆర్ ఏబిఎస్. ఇవి కాకుండా బిఎమ్‌డబ్ల్యూ, హ్యార్లీ డేవిడ్‌సన్ వంటి వివిధ విదేశీ కంపెనీలు ఈ ఫీచర్‌తో కూడిన బైక్‌లను అందిస్తున్నాయి.

శ్రావణ్.. ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న నాన్-ఏబిఎస్ వెర్షన్ అపాచీ ఆర్‌టిఆర్ 180 బైక్‌కు ఏబిఎస్‌ను బిగించడం కష్టం. ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తానని చెప్పినా అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనికి సంబంధించిన ఎక్విప్‌మెంట్ పూర్తిగా వేరేగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న డిస్క్ బ్రేక్ స్థానంలో ఏబిఎస్‌ను రీప్లేస్ చేయలేం. మీ బైక్‌లో అధనంగా ఏబిఎస్ ఫీచర్ కోసం అధిక మొత్తాన్ని వెచ్చించే బదులు కొత్త అపాచీ ఆర్‌టిఆర్ 180 ఏబిఎస్‌ బైక్‌కు అపగ్రేడ్ కావడం ఉత్తమం.

More from DriveSpark

Article Published On: Monday, September 5, 2011, 13:19 [IST]
English summary
The theory behind anti-lock brakes is simple. A skidding wheel (where the tire contact patch is sliding relative to the road) has less traction than a non-skidding wheel.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+