మల్టీ కలర్ ఆప్షన్‌తో కొత్త బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్

ప్రస్తుతం పల్సర్ 220 వేరియంట్ మల్టీ కలర్ ఆఫ్షన్‌లో లభ్యమవుతోంది. బ్లాక్ అండ్ రెడ్ షేడ్ మరియు బ్లాక్ అండ్ బ్లూ షేడ్‌లలో ఈ వేరియంట్ లభిస్తుంది. ఇప్పటికే ఈ రెండు మోడల్ బుకింగ్‌లు మరియు డెలివరీ కూడా చకచకా జరిగిపోతున్నట్లు తెలుస్తోంది. బెంగుళూరులోని ఓ స్థానిక డీలర్ ఇటీవలే ఈ మల్టీ కలర్ పల్సర్ బైక్‌లను డెలవరీ కూడా చేసింది.
బజాజ్ పల్సర్ బ్లూ, రెడ్, బ్లాక్ వంటి సోలో కలర్లలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. అయితే, పల్సర్ ప్రియుల కోరిక మేరకు బజాజ్ ఆటో గతంలో ఇందులో ఆరెంజ్ కలర్ వేరియంట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా కొనుగోలుదారుల కోరిక మేరకు బజాజ్ ఆటో రెండు రంగుల కలయికతో కూడిన మోటార్‌సైకిళ్లను అందుబాటులోకి తెచ్చింది. మల్టీ కలర్ పల్సర్ బైక్స్ గురించి వన్ఇండియా ఆటోమొబైల్స్ జులై నెలలోనే ఓ కథనంలో ప్రచురించింది.


Click it and Unblock the Notifications








