కొత్త యమహా ఆర్15 వెర్షన్ 2.0 ఫీచర్లు, ప్రత్యేకతలు

పాత వెర్షన్ ఆర్15 బైక్‌కు మరియు కొత్త తరం ఆర్15 బైక్‌కు పేరులో కాస్తంత తేడా ఉండే విధంగా 2011 యమహా ఆర్15 బైక్‌కు "వెర్షన్ 2.0" అనే పదాన్ని అదనంగా చేర్చారు. ఇంకా ఇందులో స్ప్లిట్ సీట్, వెడల్పాటి వెనుక టైరు్, కొత్త టెయిల్ కౌల్, కొత్త డిజైన్ మిడిల్ కౌల్, రియర్ డిస్క్ బ్రేక్‌లను అమర్చారు.
అంతేకాకుండా.. సైలెన్సర్ డిజైన్‌ను కూడా మార్పు చేసి, ఫౌక్స్ కార్బన్ ఫైబర్ ఫినిష్‌తో ఆకర్షనీయంగా తీర్చిదిద్దారు. బైక్ వెనుక భాగాన అమర్చిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ కొత్త ఆర్15లో మరో ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. టెన్ స్పోక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ కోటింగ్ ఇంజన్‌లు కొత్తవి.
డబుల్ హారన్, డిజైనర్ రియర్ మడ్‌గార్డ్, అల్యూమినియం స్వింద్ఆర్మ్, లింక్డ్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్ వంటివి ఇతర ప్రత్యేకతలు. యమహా వైజెడ్ఎఫ్ ఆర్ 15 పూర్తి సాంకేతిక వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
ఇంజన్:
* ఇంజన్ టైప్ : లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, 4-వాల్వ్
* సిలిండర్ అరేంజ్‌మెంట్ : సింగిల్ సిలిండర్
* డిస్‌ప్లేస్‌మెంట్ : 149.8సీసీ
* బోర్ × స్ట్రోక్ : 57 ఎమ్ఎమ్ × 58.7 ఎమ్ఎమ్
* కంప్రెషన్ రేషియో : 10.4:1
* గరిష్ట పవర్ : 17 పిఎస్ / 8500 ఆర్‌పిఎమ్
* గరిష్ట టార్క్ : 15 ఎన్ఎమ్ / 7500 ఆర్‌పిఎమ్
* స్టార్టింగ్ సిస్టమ్ : ఎలక్ట్రిక్ స్టార్ట్
* లూబ్రికేషన్ : వెట్ సంప్
* ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 12 లీటర్లు
* ఇంధన సరఫరా సిస్టమ్ : ఫ్యూయెల్ ఇంజెక్షన్
* ఇగ్నిషన్ సిస్టమ్ : టి.సి.ఐ
* ప్రైమరీ / సెకండరీ రిడక్షన్ రేషియో : 3.042 / 3.133
* క్లచ్ టైప్ : వెట్ మల్టిపుల్-డిస్క్
* ట్రాన్సిమిషన్ టైప్ : రిటర్న్ టైప్ 6-స్పీడ్
* గేర్ రేషియో : 1st = 2.833, 2nd = 1.875, 3rd = 1.364, 4th = 1.143, 5th = 0.957, 6th = 0.84
ఛాస్సిస్ :
* ఫ్రేమ్ టైప్ : డెల్టా బాక్స్
* క్యాస్టర్ / ట్రైల్ : 26° / 98mm
* టైర్ సైజ్ (ముందు మరియు వెనుక) : 90/80-17 మరియు 130/70-ఆర్17
* బ్రేక్ టైప్ (ముందు మరియు వెనుక) : హైడ్రాలిక్, సింగిల్ డిస్క్
* సస్పెన్షన్ టైప్ (ముందు మరియు వెనుక) : టెలిస్కోపిక్ / లింక్డ్ టైప్ మోనోక్రాస్
* హెడ్ లైట్ : లోబీమ్ 12వీ/35డబ్ల్యూ ఎక్స్1, హైబీమ్ 12వీ/35డబ్ల్యూ ఎక్స్2
* బ్యాటరీ : 12వీ, 3.5ఏహెచ్ (10హెచ్)
కొలతలు:
* మొత్తం పొడవు × వెడల్పు × ఎత్తు : 1970 ఎమ్ఎమ్ × 670 ఎమ్ఎమ్ × 1,070 ఎమ్ఎమ్
* సీట్ ఎత్తు : 800 ఎమ్ఎమ్
* వీల్‌బేస్ : 1345 ఎమ్ఎమ్
* మినిమమ్ గ్రౌండ్ క్లియెరెన్స్ : 160 ఎమ్ఎమ్
* కెర్బ్ వెయిట్ : 136 కేజీలు
లభించే రంగులు:
* రేసింగ్ బ్లూ
* సన్‌సెట్ రెడ్
* మిడ్‌నైట్ బ్లాక్
భారత మార్కెట్లో కొత్త యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 ధర రూ. 1.07 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications








