రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి క్లాసిక్ క్రోమ్ 500, డెసెర్ట్ స్ట్రోమ్ 500

గతంలో వన్ఇండియా ఆటోమొబైల్ క్లాసిక్ క్రోమ్ 500 సిసి మోటార్‌సైకిల్ విడుదల గురించి ముందుగానే ఓ కథనాన్ని కూడా ప్రచురించింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ సిరీస్‌లో అందిస్తున్న 'క్లాసిక్ క్రోమ్ 500', 'డెసెర్ట్ స్ట్రోమ్ 500' మోటార్‌సైకిళ్లలో ఉపయోగించిన 499 సీసీ, సింగిల్ సిలిండర్ యూసిఈ ఇంజన్ 27.2 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 41.3 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ రెండు వేరియంట్లు ఇంజన్, పెర్ఫామెన్స్‌లలో ఒక్కటే అయినప్పటికీ.. లుక్‌లో మాత్రం కాస్తంత వేరుగానే ఉంటాయి. ఈ రెండు వేరియంట్లు కూడా ఆకర్షనీయమైన బాడీ పెయింట్‌తో లభించనున్నాయి. ఈ రెండు మోటార్‌సైకిళ్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని అతి త్వరలోనే మా పాఠకులతో పంచుకుంటాం, గమనిస్తూనే ఉండండి..!


Click it and Unblock the Notifications








