గ్రామీణ రోడ్లపై రారాజు: కొత్త బజాజ్ బాక్సర్ బిఎమ్ 150

Bajaj Boxer BM 150
గ్రామీణ మార్కెట్ల కోసం బజాజ్ ఆటో పునఃప్రవేశపెట్టిన బాక్సర్ బిఎమ్ 150 సీసీ బైక్ ప్రస్తుతం గ్రామీణ రోడ్లపై దూసుకుపోతుంది. నిదానంగా ఒక్కో రూరల్ మార్కెట్లో విడుదలవుతూ వస్తున్న బాక్సర్ 150 సీసీ బైక్‌కు విశేష ఆదరణ లభిస్తోందని డీలర్లు చెబుతున్నారు. గతంలో పాత బాక్సర్‌కు కూడా మార్కెట్లో మంచి ఆదరణ ఉండేది. అన్ని రోడ్లకు అనువుగా, 150 సీసీ ఇంజన్ అయినప్పటికీ మైలేజ్ విషయంలో రాజీపడకుండా కొత్త బాక్సర్ 150 సీసీను కొత్త హంగులతో తీర్చిదిద్దారు.

గ్రామీణ రోడ్లపై రైడ్ కంట్రోల్ కోసం వెడల్పాటి టైర్లు, ట్రాఫిక్‌లో టెన్షన్ ఫ్రీ ఇంజన్ స్టార్ట్ కోసం ఎలక్ట్రిక్ స్టార్ట్, దూర ప్రయాణాల్లో సౌకర్యవంతమైన ప్రయాణ అనభూతి కోసం విశాలమైన సీట్‌లను కొత్త బాక్సర్ బిఎమ్ 150సీసీ బైక్‌లో అమర్చారు. దీని ఇంజన్ 12 పిఎస్‌ల శక్తిని మరియు 12.26 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. అంటే ఈ శక్తి ఒక సాధారణ 100 సీసీ బైక్‌ కన్నా సుమారు 50 శాతం అధికం అన్నమాట. అంతేకాదు ఇది లీటరు పెట్రోల్‌కు 55-62 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది.

కొత్త బాక్సర్ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయకుండా, దీని ఇంజన్‌ను శక్తివంతగా తీర్చిదిద్దారు. బాక్సర్ 150 సీసీ ఇంజన్ 12 పిఎస్‌ల శక్తిని మరియు 12.26 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. గ్రామీణ రహదారులపై సౌకర్యంగా సవారీ చేసేందుకు విశాలమైన సీటును మరియు అధిక బరువు తీసుకువెళ్లేందుకు వెనుక లగేజ్ క్యారియర్‌ను కొత్త బాక్సర్‌లో అమర్చడం జరిగింది.

గతుకుల రోడ్లపై సైతం సౌకర్యవంతమైన రైడ్ కోసం కొత్త బాక్సర్ బైక్‌కు ముందువైపు టెలిస్కోపిక్ షాక్ అబ్జార్వర్లను, వెనుకవైకు స్ప్రింగ్ ఇన్‌సైడ్ స్ప్రింగ్ (ఎస్ఎన్ఎస్) సిస్టమ్‌తో కూడిన షాక్ అబ్జార్వర్లను అమర్చారు. ఇందులో నిరుత్సాహకర విషయం ఏంటంటే.. ఇంజన్ 150 సీసీ అయినప్పటికీ, ఇది డ్రమ్ బ్రేక్ సిస్టమ్‌తోనే లభిస్తుంది (డిస్క్ బ్రేక్ ఆప్షన్ లేదు). ఇందులో చెప్పుకోదగి విషయం ఏంటంటే.. దీని ధర. ఇది రూ.43,009 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)లకే లభిస్తుంది. ఓ 150సీసీ బైక్ ఇంత తక్కువ ధరకు లభించడం విశేషం.

More from DriveSpark

Article Published On: Monday, September 19, 2011, 16:54 [IST]
English summary
Bajaj Auto, the Indian two-wheeler manufacturer has launched the new boxer 150 with a starting price of Rs.43,009 (Ex-showroom Hyderabad). The 150cc variant of the Boxer will now be available across all authorized Bajaj dealers in India. The on road price of the Boxer is about Rs.48,700 in Pune. The new Boxer is at least Rs.7,000 cheaper than the equally powered discover city bike. As we had reported earlier, the new boxer will be focused at the rural bike market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+