టీవీఎస్‌ను ముందుకు నడిపిన అపాచీ ఏబిఎస్

TVS Apache RTR 160
దేశీయ తృతీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ, చెన్నయ్‌కు చెందిన 'టీవీఎస్ మోటార్ కంపెనీ' ఇటీవల ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్‌తో విడుదల చేసిన భారతదేశపు తొలి ఏబిఎస్ బైక్ 'ఆపాచీ ఆర్‌టిఆర్ 180 ఏబిఎస్' సంస్థ విక్రయాల వృద్ధికి ఎంతగానో తోడ్పడింది. జులై నెలలో టీవీఎస్ అమ్మకాలు 16 శాతం పెరిగి 1,92,000 యూనిట్లను విక్రయించింది.

గతేడాది ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 1,66,214 యూనిట్లుగా ఉన్నట్లు టీవీఎస్ వెల్లడించింది. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీ ప్రోత్సాహకర వృద్ధిని నమోదు చేసుకుంది.

ద్విచక్ర వాహనాలు
గత నెలలో మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలు 16 శాతం పెరిగి, గతేడాది ఇదే నెలతో పోలిస్తే 163,106 యూనిట్ల నుంచి 188,500 యూనిట్లకు పెరిగాయి. కాగా.. ఇదే కాలానికి స్కూటర్ల అమ్మకాలు 24 శాతం వృద్ధి చెంది 40,357 యూనిట్ల నుంచి 50,000 యూనిట్లకు పెరిగాయి. ఇకపోతే, మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 19 శాతం వృద్ధి చెంది 61,051 యూనిట్ల నుంచి 72,500 యూనిట్లకు పెరిగాయి.

త్రిచక్ర వాహన అమ్మకాలు
జులై 2011లో కంపెనీ త్రిచక్ర వాహన అమ్మకాలు 13 శాతం వృద్ధి చెంది 3,500 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో త్రిచక్ర వాహన అమ్మకాలు 3,108 యూనిట్లుగా ఉన్నాయి. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులై 2011 కాలానికి గానూ మొత్తం టీవీఎస్ త్రిచక్ర వాహన అమ్మకాలు 14,923 యూనిట్లుగా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, August 1, 2011, 13:19 [IST]
English summary
Indian two wheeler manufacturer TVS has reported its July sales figures. The third largest two-wheeler manufacturer of the country said it sold 16 per cent more vehicles in July. TVS' sales in July was at 1,92,000 units as against the 166,214 units the company sold in the corresponding period last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+