ట్రాఫిక్‌లో చిక్కుకొని టివీ ప్రోగ్రామ్‌లు మిస్ అవుతున్నారా..

ట్రావెలింగ్ కారణంగా ముఖ్యమైన టెలివిజన్ ఛానెళ్లు మిస్ అవుతున్న వారి కోసం ముంబైకు చెందిన అవనిటివీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ సరికొత్త కార్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థను పరిచయం చేసింది. ఒకప్పుడు యాంటెన్నా ద్వారా దూరదర్శన్ ఛానెళ్లను వీక్షించే వాళ్లం గుర్తుందా, ఆ తర్వాతి కాలంలో కేబుల్ టెలివిజన్లు రావడంతో ఈ యాంటెన్నాలను కాస్తా పాత ఇనుప సామాన్ల వాళ్లకు వేసేశాం అనుకోండి.
అయితే.. ఇప్పుడు 'ఓల్డో ఈజ్ గోల్డ్' అని ఆంగ్లంలో అన్న సామెత అక్షరాల నిజమైంది. పట్టణాలు, నగరాలు చివరకు మారుమూల పల్లెల్లో సైతం ప్రతి ఇంటిపై చిప్ప (డిష్) టివీలు వెలుస్తున్నాయి. ఇదే కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని అవనిటివి ఓ సరికొత్త కమ్యూనికేషన్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. కారులోపలి భాగంలో ఓ చిన్న సెటాప్ బాక్సును అమర్చుకోవడం ద్వారా కారులోపల అమర్చిన ఎల్‌సిడి స్క్రీన్‌పై లైవ్ టివీని వీక్షించవచ్చు.
అవనిటివీ కార్-సెటాప్ బాక్స్ గురించి మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT) పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








