కారులో లైవ్ టివీ, ఇంటర్నెట్, సినిమాలు మరెన్నో...

AvaniTV Car Kit
ఇన్-కార్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌లోనే ఇదివరకెన్నడూ లేని విధంగా అవనిటివీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసిన 'అవనిటివీ' కారులో అమర్చుకోవడం ద్వారా అన్ని ప్రముఖ భారతీయ టెలివిజన్ ఛానెళ్లను వీక్షించవచ్చు. అంతేకాదండోయ్.. ఈ సిస్టమ్‌ను అమర్చుకోవడం ద్వారా సినిమాలు, లైవ్ రేడియో, ఇంటర్నెట్ వీడియోలను ఒక్క బటన్‌పై క్లిక్ చేస్తే మీ కళ్లముందు ఉండే తెరపై ప్రత్యక్షమవుతాయి.

ఇది సాధారణ డిష్ టివీల మాదిరి పెద్దగా ఉండకుండా చాలా పోర్టబుల్‌గా, సులువుగా కారుకు అమర్చుకునేలా ఉంటుంది. అవనిటివీను కారులో అమర్చుకోవడం వల్ల స్టాక్ మార్కెట్ లైవ్ అప్‌డేట్‌లను, రాజకీయ వార్తలను ఇంకా ఎన్నెన్నో వినోద కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ప్రారంభంలో భాగంగా ప్రస్తుతం అవనిటివీకు చందాదారులు 40కు పైగా లైవ్ ఛానెళ్లను వీక్షించవచ్చు.

ఈ ఛానెళ్లలో సిఎన్‌బిసి టివీ18, సిఎన్ఎన్ ఐబిఎన్, టైమ్స్ నౌ, ఐబిఎన్7, ఐబిఎన్ లోక్‌మట్, ఎమ్‌టివీ, ఆజ్ తక్, జూమ్. 9ఎక్స్ఎమ్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి కాకుకండా ఆన్-డిమాండ్ మూవీస్ పేరిట అవనిటివీ మూవీ లైబ్రరీ నుండి మీకు నచ్చిన సినిమాను ఎంచుకొని ట్రాఫిక్ గోలను మర్చిపోయి ఎంచక్కా సినిమా చూడొచ్చు. ఇంకా.. అవనిటివీ అందిస్తున్న ఇంటర్నెట్ కనెక్షన్‌తో మీ స్నేహితలతో ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండొచ్చు.

దేశంలోని ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, కలకత్తా, కొచిన్ పూణే వంటి అన్ని ప్రధాన నగరాల్లో ఈ అవనిటివీ కార్ కిట్‌లు లభ్యమవుతాయి. అవనిటివీ కార్ కిట్‌ ధర కేవలం రూ.19,990 మాత్రమే. ఎల్‌సిడి స్క్రీన్ అదనం. కారులో ఈ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్‌కు ఇంటీరియర్స్‌లో అదనపు మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ ప్రతినిధులే వచ్చి ఈ వ్యవస్థను మీ కారులో ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ సిస్టమ్‌ను ఆర్డర్ చేయడానికి లేదా మరిన్ని వివరాలకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 5, 2011, 12:32 [IST]
English summary
Mumbai based avaniTV Solutions Pvt Ltd launches has launched a in-car entertainment system called 'avaniTV'. This system will offer live TV channels, movies, Internet and live radio in your car. Wherever you go your TV will follows you with avaniTV car kit. This avaniTV Car Kit which costs Rs. 19,990.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+