ఏప్రిల్ నుండి బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ బుకింగ్స్ ప్రారంభం!
ఈ మోడల్‌కు మార్కెట్లో మంచి స్పందన లభించగలదని బజాజ్ ఆశిస్తోంది. 'పల్సర్ 200ఎన్ఎస్' (నేక్‌డ్ స్పోర్ట్స్) పేరుతో విడుదలైన ఈ స్పోర్ట్స్ బైక్‌లో, ప్రపంచంలోనే ఎక్కడాని లేని విధంగా తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన 199.5సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.4 బిహెచ్‌పిల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 1.86 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
పల్సర్ 200ఎన్ఎస్ బైక్ కేవలం 3.8 సెకన్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది, అలాగే 9.8 సెకన్లలో 0-100 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది గంటకు గరిష్టంగా 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. కొత్త 2012 పల్సర్ 200ఎన్ఎస్ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ (గంటకు 55 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు మాత్రమే) మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఇది కూడా చదవండి..: పల్సర్ 135, యమహా ఆర్15 వెర్షన్ 2.0, కెటిఎమ్ డ్యూక్ 200 మోడళ్లను కాపీ కొట్టి పల్సర్ 200 ఎన్ఎస్ మోడల్‌ను డిజైన్ చేశారా..?


Click it and Unblock the Notifications









