టాటా ఆరియాలో హార్మన్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, ఫెరారీ, లెక్సస్, మెర్సిడెస్ బెంజ్, పోర్షే, ల్యాండ్ రోవర్, జనరల్ మోటార్స్, క్రిస్లర్, ఫియట్, టొయోటా, ఫోక్స్‌వ్యాగన్ వంటి ప్రముఖ కార్ బ్రాండ్లకు ఇన్-కార్ ఎంటర్‌టైన్‌మెంట్ పరికరాలను సరఫరా చేసే ప్రముఖ ప్రీమియం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ల తయారీ కంపెనీ హార్మన్స్ ఇకపై టాటా మోటార్స్‌కు కూడా తమ ఉత్పత్తులను సరఫరా చేయనుంది. ఈ మేరకు ఇరు కంపెనీ మధ్య ఓ ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందంలో భాగంగా, టాటా మోటార్స్ అందిస్తున్న లగ్జరీ క్రాసోవర్ ఆరియాలో హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లను అమర్చనున్నారు. పది స్పీకర్లు, ఒక సూపర్బ్ సబ్‌వూఫర్‌తో కూడిన ప్రీమియం 360 వాట్ జెబిఎల్ సౌండ్ సిస్టమ్‌ను టాటా ఆరియాలో అమర్చనున్నారు. టాటా మోటార్స్‌కు హార్మన్ తమ ఉత్పత్తులను సప్లయ్ చేయటం ఇదే మొదటిసారి. ఈ డీల్‌తో కేవలం ఆరియాలో మాత్రమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని టాటా కార్లలో కూడా ఈ హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లను మనం అంచనా వేయవచ్చు.
టాటా ఆరియా 4x2 ఫీచర్లు
సెడాన్‌లోని విలాసవంతమైన ఫీచర్లను, ఎస్‌యూవీలోని శక్తి వంతమైన ఇంజన్‌ను కలగలపి టాటా మోటార్స్ ఆరియా క్రాసోవర్‌ను అభివృద్ధి చేసింది. కొత్త టాటా ఆరియాలో 2.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ కామర్ రైల్ డీజిల్ ఇంజిన్‌తో 140 పీఎస్ పవర్‌ను మరియు 320 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 13.7 కి.మీ.మైలేజీనిస్తుంది. ఇంకా ఇందులో శాటిలైట్ నావిగేషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, బ్లూటూత్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.
ప్రీమియం లెథర్ సీటింగ్ ఇందులో మరో అదనపు ఆకర్షనగా నిలువనుంది. అంతేకాకుండా.. కొత్త టాటా ఆరియాలో ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(ఈబిడి)తో కూడిన యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా అమర్చడం జరిగింది. ప్యూర్, ప్లెజర్, ప్రెస్టీజ్ అనే మూడు వేరియంట్లలో టాటా ఆరియా లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications









