రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశింటిన చౌక రకం టాటా ఆరియా

Tata Aria
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌ అందిస్తున్న క్రాసోవర్ టాటా అరియాలో ఇటీవలే ప్రవేశపెట్టిన చౌకరగం టాటా ఆరియాను కంపెనీ బుధవారం రాష్ట్ర మార్కెట్లోకి కూడా విడుదల చేసింది. సెడాన్‌‌లోని లగ్జరీ ఫీచర్లు మరియు ఎస్‌యూవీలోని పవర్ సరికొత్త టాటా ఆరియా సొంతం. టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో కూడిన టాటా ఆరియా ధరలు రాష్ట్ర మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. టాటా ఆరియా ప్యూర్ ధర రూ.11.79 లక్షలు, టాటా ఆరియా ప్లెజర్ ధర రూ.12.81 లక్షలు, టాటా ఆరియా ప్రెస్టీజ్ ధర రూ.14.49 లక్షలు (అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)గా ఉన్నాయి.

అక్టోబర్ 2010లో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన టాటా ఆరియాను టాటా మోటార్స్ విడుదల చేసింది. అయితే, దీని ధర కాస్తంత అధికంగా ఉండటంతో మార్కెట్ నుంచి పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో టాటా ఆరియా అమ్మకాలకు మరింత ఊతమమిచ్చేందుకు కంపెనీ ఇందులో చౌక వేరియంట్‌ను ఇటీవలే ప్రవేశపెట్టడం జరిగింది. కొత్త టాటా ఆరియా 4x2 క్రాసోవర్ కారు 2.2 లీటర్ డైరెక్ట్‌ ఇంజెక్షన్‌ కామర్‌ రైల్‌ డీజిల్ ఇంజిన్‌‌తో 140 పీఎస్‌ పవర్‌ను మరియు 320 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను కలిగి ఉంటుంది.

ఇది లీటరు డీజిల్‌కు 13.7 కి.మీ.మైలేజీనిస్తుంది. ఇంకా ఇందులో శాటిలైట్ నావిగేషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, బ్లూటూత్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రీమియం లెథర్ మరో అదనపు ఆకర్షనగా నిలువనుంది. అంతేకాకుండా.. కొత్త ఆరియాలో ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌(ఈబిడి)తో కూడిన యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబిఎస్) వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా అమర్చడం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ హెడ్-ప్రోడక్ట్ గ్రూప్-యుటిలిటీ వెహికల్స్ రాజేశ్ నాయర్ మాట్లాడుతూ.. టాటా ఆరియా ఎగుమతులపై దృష్టిసారిస్తున్నామని, త్వరలోనే యూరప్ సహా ఇతర మార్కెట్లకు ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

కొత్త టాటా ఆరియా 4x2 క్రాసోవర్ ఫీచర్ల గురించి వన్ఇండియా పాఠకులకు ఇది వరకే వివరించడం జరిగింది. కాగా.. మరోసారి ఈ మోడల్ ఫీచర్ల గురించి సమాచారం మీ కోసం...

* సెడాన్ యొక్క లగ్జరీ ఫీచర్లను మరియు ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) యొక్క పవర్‌లను కలిపి టాటా ఆరియా కొత్త క్రాసోవర్‌ను రూపొందించారు.
* ఇందులో ఉపయోగించిన 2.2 లీ. డీజిల్ కామన్ రైల్ ఇంజన్ 140 పిఎస్‌ల శక్తిని మరియు 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
* ఇందులోని విలాసవంతమైన ప్రీమియం లెథర్ సీటింగ్ థియేటర్-స్టైల్ అనుభూతిని కల్పిస్తూ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
* కొత్త టాటా ఆరియాలో అమర్చిబడిన డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్ అన్నివైపుల నుంచి ప్రయాణికులను రక్షిస్తాయి.
* ఇంకా ఇందులో చీకటిని గుర్తించి ఆటోమేటిక్‌గా పనిచేసే హెడ్‌లైట్లు మరియు వర్షాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా పనిచేసే వైపర్లు ఉన్నాయి.
* స్టీరింగ్‌కు మొబైల్ ఫోన్‌ను అమర్చుకునే సౌకర్యం మరియు స్టీరింగ్ మౌంటెడ్ మ్యూజిక్ కంట్రోల్స్.
* ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ద్వారా వాతావరణానికి అనుగుణంగా పనిచేసే ఏసి (ఎయిర్ కండిషనింగ్).
* అత్యవసర సమయాల్లో బ్రేక్ వేయాల్సివచ్చినప్పుడు సురక్షితమైన బ్రేకింగ్ కోసం ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) మరియు ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి సేఫ్టీ ఫీచర్లు.
* ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ అండ్ రీట్రాకబుల్ ఓఆర్‌విఎమ్‌లు.
* 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి అత్యత్తమ ఫీచర్లు కొత్త టాటా ఆరియా 4x2 క్రాసోవర్ సొంతం.

More from DriveSpark

Article Published On: Thursday, August 18, 2011, 8:07 [IST]
English summary
Tata Motors launched it all-new crossover Tata Aria 4x2 in Hyderabad. "The crossover meets all global standards and is ready for export. We have begun selling the crossover launched in October 2010 in Nepal and hope to follow this up by introducing in other markets," said Mr Rajesh Nair, Head-Product Group-Utility Vehicles, Passenger Car Business, Tata Motors Ltd.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+