డ్యూరో డిజెడ్ తర్వాత మార్కెట్లోకి రానున్న రోడియో ఆర్‌జెడ్
ద్విచక్ర వాహన విభాగంలో రాణించేందుకు మహీంద్రా గ్రూపుకు చెందిన టూవీలర్ విభాగం మహీంద్రా 2-వీలర్స్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో, కంపెనీ ప్రస్తుతం అందిస్తున్న స్కూటర్లను అప్‌గ్రేడ్ చేసి, సరికొత్త హంగులతో తీర్చిదిద్ది, ఆధునిక యువతను ఆకట్టునునే విధంగా ముస్తాబు చేసి మరీ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో మహీంద్రా 2-వీలర్స్ అందిస్తున్న డ్యూరో స్కూటర్‌లో 'డ్యూరో డిజెడ్' అనే పవర్‌ఫుల్, అప్‌గ్రేడెడ్ స్కూటర్‌ను కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ఇప్పుడు ఇదే తరహాలో.. మహీంద్రా 2-వీలర్స్ అందిస్తున్న రోడియో స్కూటర్‌లో 'రోడియో ఆర్‌జెడ్' అనే పేరుతో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మహీంద్రా రోడియో కన్నా ఎన్నోరెట్లు మెరుగ్గా ఉండేలా, సరికొత్త మార్పులతో కొత్త రోడియో ఆర్‌జెడ్ త్వరలోనే వాణిజ్య పరంగా మార్కెట్లో లభ్యం కానుంది.
రోడియో ఆర్‌జెడ్ ప్రస్తుత రోడియో స్కూటర్ కన్నా కొద్దిగా పొడవుగా (20 మి.మీ.) ఉండటమే కాకుండా, గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా (25 మి.మీ.) పెంచటం జరిగింది. రోడియో ఆర్‌జెడ్ స్కూటర్‌లో ఫ్రంట్ అండ్ సైడ్ ప్యానెల్స్‌పై కొత్త గ్రాఫిక్స్, కాంతివంతమైన హెడ్‌ల్యాంప్, బాడీ కలర్‌లో ఉండే సైడ్ మిర్రర్స్, క్లియర్ లెన్స్ కలిగిన సైడ్ ఇండికేటర్స్ వంటి ప్రధాన మార్పులను ఇందులో మనం గమనించవచ్చు.
రోడియో ఆర్‌జెడ్‌లో కూడా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటల్ ప్యానెల్ ఉండనుంది. అయితే, ఇది ఏడ బ్యాగ్రౌండ్ కలర్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో వేగాన్ని చూపించే స్పీడోమీటర్, టాకోమీటర్, ట్రిప్-మీటర్, ఓడోమీటర్, యాక్సిలరేషన్ టైమ్, అధిక వేగంతో వెళ్తున్నప్పుడు అలెర్ట్ చేసే ఓవర్‌స్పీడ్ అలారమ్, ట్యాంకులో ఇంధన స్థాయిని సూచించే ఫ్యూయెల్ గేజ్, క్లాక్ (గడియారం) మరియు సైడ్ స్టాండ్ వేసి ఉందని హెచ్చరించే అలారమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
రోడియో ఆర్‌జెడ్‌లో షట్టర్‌తో కూడిన ఇగ్నిషన్ కీ స్లాట్ (ఇంజన్ స్విచ్-ఆన్ కీ), చిన్నపాటి గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకునేందుకు 12 వోల్ట్ ఛార్జ్ పోర్ట్, పెట్రోల్ ఫిల్ చేసుకోవటానికి సీట్ పైకెత్తాల్సిన అవసరం లేకుండా ముందవైపే డిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫ్యూయెల్ ఫిల్లర్, బ్యాగ్ హుక్, ఓపెన్ గ్లౌవ్ బాక్స్, సీట్ క్రింది భాగంలో చిన్న చిన్న వస్తువులను దాచుకునేందుకు వీలుగా ఉన్న 22 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ వంటి మార్పులు ఉన్నాయి.
మహీంద్రా రోడియో ఆర్‌జెడ్ స్కూటర్‌కు మరిన్ని ఫీచర్లు, ధర తదితర వివరాల కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








