మహీంద్రా రోడియో ఆర్‌జెడ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర

రోడియో ఆర్‌జెడ్ కూడా 125సీసీ ఇంజన్‌తో లభిస్తుంది. ఇందులో అమర్చిన 124.6సీసీ ఫోర్-స్ట్రోక్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 0.91 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ట్రాన్సిమిషన్ (ఆటోమేటిక్ గేర్స్)తో లభిస్తుంది. మెరుగైన మైలేజ్‌ను ఇచ్చేందుకు గానూ ఈ ఇంజన్‌లో అప్‌డేటెడ్ డ్యూయల్-కర్వ్ డిజిటల్ ఇగ్నిషన్ సిస్టమ్ (డిసిడిఐ)ను ఉపయోగించామని మహీంద్రా పేర్కొంది.

ఎలాంటి రోడ్లపై అయినా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు గానూ రోడియో ఆర్‌జెడ్‌లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను వెనుక వైపు మోనో (సింగిల్) షాక్ అబ్జార్వర్‌లను ఉపయోగించారు. ఈ ఆటోమేటిక్ గేర్‌లెస్ స్కూటర్‌కు ముందు, వైనుక వైపున 130 మి.మీ. డ్రమ్ బ్రేక్‌లను ఉపయోగించారు. ఇది ఎమ్ఆర్ఎఫ్ టైర్లతో లభిస్తుంది. మహీంద్రా రోడియో ఆర్‌జెడ్ ఏడు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది. ధర విషయంలో కూడా ప్రస్తుతం లభిస్తున్న రోడియోకు, రోడియో ఆర్‌జెడ్ పెద్దగా వ్యత్యాసం ఉండే అవకాశాలు కనిపించడం లేదు. త్వరలోనే ఈ మోడల్‌ను మహీంద్రా 2-వీలర్స్ మార్కెట్లోకి తీసుకురానుంది.

మహీంద్రా రోడియో ఆర్‌జెడ్ సాంకేతిక వివరాలు:

ఇంజన్:
ఇంజన్ టైప్ - 124.6సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్
గరిష్ట పవర్ - 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8.0 బిహెచ్‌పి
గరిష్ట టార్క్ - 5500 ఆర్‌పిఎమ్ వద్ద 0.91 కెజిఎమ్

ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్):
టైప్ - సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్)

ఛాస్సిస్ అండ్ బాడీ:
వీల్స్ - ప్రెస్స్‌డ్ స్టీల్, 10 ఇంచెస్
టైర్స్ - 90/100 X 10 ఎఫ్/ఆర్

సస్పెన్షన్:
ముందు వైపు - టెలిస్కోపిక్ ఫోర్క్స్
వెనుక వైపు - మోనోషాక్

బ్రేక్స్:
ముందు వైపు - 130 మి.మీ డ్రమ్
వెనుక వైపు - 130 మి.మీ డ్రమ్

అంచనా ధర:
రూ.48,000/- (ఎక్స్-షోరూమ్)

More from DriveSpark

Article Published On: Friday, June 8, 2012, 19:46 [IST]
English summary
After successfully launching the Duro DZ scooter, auto major Mahindra and Mahindra's two-wheeler arm Mahindra 2-Wheelers is all set bring an updated version of its Rodeo scooter. The facelift Rodeo scooter will be renamed as Rodeo RZ. Rodeo RZ will be powered by 124.6cc, four-stroke, air-cooled engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+