డిస్కవర్ 125 ఎస్‌టి (స్పోర్ట్స్ టూరర్)ని విడుదల చేసిన బజాజ్

బజాజ్ ఆటో అందిస్తున్న డిస్కవర్ బ్రాండ్‌లో ఓ సరికొత్త వేరియంట్‌ను నేడు మార్కెట్లో ఆవిష్కరించింది. ఆకర్షనీయమైన డిజైన్, సరికొత్త లుక్, 125సీసీ బైక్ సెగ్మెంట్లో మరే బైక్‌లో లేని విశిష్టమైన ఫీచర్లతో కంపెనీ ఈ కొత్త బైక్‌ను రూపొందించింది. "డిస్కవర్ 125 ఎస్‌టి" (స్పోర్ట్స్ టూరర్) అనే కొత్త పేరుతో ఈ బైక్ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో, ఈ విభాగంలోనే మొదటిసారిగా డిటిఎస్-ట్విన్ స్పార్క్ టెక్నాలజీ కలిగిన ఇంజన్‌ను ఉపయోగించారు.

ఈ శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 13 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పవర్‌తో పాటు మైలేజ్‌ విషయంలో ఎలాంటి రాజీపడకుండా ఉండే విధంగా కొత్త డిస్కవర్ 125 ఎస్‌టిని రూపొందించామని బజాజ్ ఆటో పేర్కొంది.


స్పోర్టీ లుక్‌నిచ్చే కొత్త డిస్కవర్ 125 ఎస్‌టిలో 5-స్పీడ్ గేర్ బాక్స్, రీడిజైన్ చేయబడిన ఫ్యూయెల్ ట్యాంక్, షార్ప్ ఎడ్జ్‌లు కలిగిన పవర్‌ఫుల్ హెడ్‌ల్యాంప్, స్టయిలిష్ అల్లాయ్ వీల్స్, మోనోషాక్ సస్పెన్షన్, ఎలాంటి రోడ్లపై అయినా సౌకర్యవంతంగా ప్రయాణించేలా రూపొందించిన యాంటీ వైబ్రేషన్ ఫ్రేమ్, మరింత సురక్షితమైన బ్రేకింగ్ కోసం అమర్చిన పెటల్ డిస్క్ బ్రేక్ వంటి మార్పులను గమనించవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, May 14, 2012, 18:59 [IST]
English summary
Bajaj Auto has unveiled the new 2012 Discover 125 ST – Sports Tourer in New Delhi on May 14th (today). The new Discover is expected to hit the showrooms by the second half of June.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+