యమహా రే, టీవీఎస్ క్యూబ్ 100 హైబ్రిడ్, 125సీసీ స్కూటర్

యమహా స్కూటర్ కోసం ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న ఎదురుచూపులు ఫలించాయి. 11వ ఆటో ఎక్స్‌పోలో యమహా తొలిసారిగా తమ స్కూటర్ల రేంజ్‌ను భారతీయులకు పరిచయం చేసింది. ఇందులో భారత మార్కెట్ కో రూపొందించిన "యమహా రే" స్కూటర్ కూడా ఈ సంవత్సరంలోనే మార్కెట్లోకి ప్రవేశించనుంది. అయితే ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ వెర్షన్. కానీ కాన్సెప్ట్ వెర్షన్‌కు, ప్రొడక్షన్ వెర్షన్‌కు పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా. ప్రత్యేకించి భారతీయ మహిళలను దృష్టిలో ఉంచుకొని యమహా ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేసింది.
7. టీవీఎస్ క్యూబ్ 100 హైబ్రిడ్ స్కూటర్:
చెన్నైకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎఎస్ మోటార్‌సైకిల్స్ 12వ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన పెట్రోల్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కాన్సెప్ట్ స్కూటర్ "క్యూబ్ 100 హైబ్రిడ్"ను జులై నెలలో కంపెనీ విడుదల చేయనుంది. అయితే, తొలుత టెస్ట్ రన్ ప్రాతిపదికన కేవలం 50 స్కూటర్లను మాత్రమే కంపెనీ విడుదల చేయనుంది. ఇది 100సీసీ ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను అలాగే ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంటుంది. స్టార్ట్-స్టాప్ సిస్టమ్, బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో ఇది లభించనుంది. క్యూబ్ 100 హైబ్రిడ్ స్కూటర్ వచ్చే సంవత్సరంలో వాణిజ్యపరంగా మార్కెట్లో లభ్యం కానుంది.
8. టీవీఎస్ 125సీసీ స్కూటర్:
ప్రస్తుతం టీవీఎస్ అందిస్తున్న వెగో 110సీసీ స్కూటర్‌కు ఓ 125సీసీ స్కూటర్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది అందుబాటులోకి రానుంది. దీని పేరు, ఇతర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








