పియాజ్జియో వెస్పా ఎల్ఎక్స్125, కొత్త హోండా డియో

స్కూటర్ల హయాంలో ఓ వెలుగు వెలిగిన వెస్పా స్కూటర్ తిరిగి భారత మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఢిల్లీలో ముగిసిన 12వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో పియాజ్జియో తమ వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. అయితే, ప్రస్తుతం రానున్న వెస్పా స్కూటర్ మాత్రం, దాదాపు అదే క్లాసిక్ లుక్‌ను కలిగి ఉండి లైఫ్‌స్టయిల్ స్కూటర్‌గా ఉండనుంది. సింపుల్‌గా చెప్పాలంటే, సాధారణ సాంప్రదాయం స్కూటర్ల ధర కన్నా కాస్తంత అధికంగానే ఉంటుదన్నమాట.
ఇది భారత్‌లో అత్యంత శక్తివంతమైన ఆటోమేటిక్ స్కూటర్‌గా నిలువనుంది. ఇందులో ఉపయోగించిన 125సీసీ ఫోర్-స్ట్రోక్ ఇంజన్ 10.6 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. దీని ధర సుమారు రూ.55,000 వరకూ ఉండొచ్చని అంచనా.
5. హోండా కొత్త డియో:
హోండా నుండి లభిస్తున్న స్పోర్టీ స్టయిల్ స్కూటర్ "హోండా డియో" తన రూపురేఖలు మార్చుకొని సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనుంది. ఇప్పటికే కొత్త హోండా డియో స్కూటర్ డిజైన్‌పై కంపెనీ కసరత్తులు ప్రారంభించింది. ఆక్టివాలో ఉపయోగించిన పవర్‌ఫుల్ 110సీసీ ఇంజన్‌ను డియోలో కూడా ఉపయోగించనున్నారు. సరికొత్త స్టయిలింగ్, ట్యూబ్‌లెస్ టైర్స్, 15 శాతం అధిక మైలేజ్ వంటి ప్రధాన మార్పులు డియో స్కూటర్‌లో చోటు చేసుకోనున్నాయి. మరికొద్ది నెలల్లోనే కొత్త అప్‌గ్రేడెడ్ డియో స్కూటర్ దేశీయ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఇక ధర విషయానికి వస్తే.. ప్రస్తుతం చెల్లిస్తున్న దానికన్నా కొంత అధిక మొత్తాన్ని చెల్లించాల్సి రావచ్చు.
యమహా రే, టీవీఎస్ క్యూబ్ 100 హైబ్రిడ్, 125సీసీ స్కూటర్ల కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








