మార్చిలో రానున్న సుజుకి స్విష్ 125, హీరో మాస్ట్రో 110 స్కూటర్స్

జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇటీవల ముగిసిన 11వ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసిన 125సీసీ స్కటర్ "సుజుకి స్విష్ 125" ఈ సంవత్సరంలోనే మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే సుజుకి నుండి సక్సెస్ అయిన 125సీసీ స్కూటర్ యాక్సెస్ 125 ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా కంపెనీ ఈ కొత్త స్కూటర్‌ను అభివృద్ధి చేసింది. ఒకరకంగా చెప్పాలంటే, ఇది యాక్సెస్ 125కు పూర్తి స్టైలిష్ వెర్షన్ అని చెప్పవచ్చు. వచ్చే మార్చి నెలలో సుజుకి స్విష్ 125 విడుదల కావచ్చని. దీని ధర రూ.45,431 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండనుంది.
3. హీరో మాస్ట్రో 110:
ప్రపంచపు నెంబర్ బైక్ మేకర్ హీరో మోటోకార్ప్ నుండి రానున్న మరో స్కూటర్ "మ్యాస్ట్రో 110". ఇది ప్రస్తుతం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ అందిస్తున్న ఏవియేటర్ 110సీసీ స్కూటర్‌కు పూర్తిగా జిరాక్స్ అని చెప్పవచ్చు. ఏవియేటర్ స్కూటర్‌ను కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి కొత్త పేరుతో హీరో మోటోకార్ప్ విడుదల చేయనుంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. హీరో మోటోకార్ప్ అందిస్తున్న ప్లెజర్ స్కూటర్ కన్నా కాస్తంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.
పియాజ్జియో వెస్పా ఎల్ఎక్స్125, కొత్త హోండా డియో స్కూటర్ల కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








