ఫియస్టా సెడాన్ కోసం ఫోర్డ్ ఆఫర్ చేస్తున్న యాక్ససరీలు-1
1. వెథర్‌షీల్డ్స్ (ఎయిర్ డిఫ్లెక్టర్స్): తక్కు బరువు కలిగిన ఎఫ్ఆర్‌పి మెటీరియల్‌తో తయారు చేసిన ఈ వెథర్‌షీల్డ్‌ను అమర్చుకోవటం వలన వేడి గాలులు, వర్షపు నీరు కారు లోపలకి ప్రవేశించకుండా ఉంచేందుకు ఉపకరిస్తుంది. చిన్నపాటి జల్లులు పడుతున్నప్పుడు, వేడిగాలులు వీస్తున్నప్పుడు కారు అద్దాలను క్రిందకి దించి ఉన్నప్పటికీ సౌకర్యవంతంగా డ్రైవ్ చేసేందుకు సహాయపడుతాయి.
2. ఇల్యుమినేటెడ్ డోర్ స్కఫ్ ప్లేట్స్ (ముందువైపు మాత్రమే): డోర్లను ఓపెన్ చేసినప్పుడు ప్రకాశించే విధంగా డోర్‌కు కాస్తంత ముందు భాగంలో క్రోమ్ కోటింగ్‌తో అమర్చబడిన డోర్ స్కఫ్ ప్లేట్స్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇవ్వడమే కాకుండా, గీతలు పడటం, డ్యామేజ్ కావటం నుండి రాకర్ ప్యానెల్‌ను కాపాడుతుంది.
3. స్పోర్టీ పెడల్స్ (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌కు మాత్రమే): యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ పెడల్స్‌పై కాలు జారిపోకుండా ఉండేలా రబ్బర్ నాబ్స్‌తో రూపొందించబడి ఉంటుంది. డ్రైవింగ్‌లై పెడల్స్‌పై మంచి గ్రిప్‌ను ఇచ్చేందుకు ఇవి ఉపయోగపడుతాయి.
4. ఇల్యుమినేటెడ్ గేర్ నాబ్: ఇది కారుకు మంచి లుక్‌ను ఇవ్వటమే కాకుండా, రివర్స్ గేర్ వేసినప్పుటు ఆటోమేటిక్‌గా రెడ్ కలర్‌లో వెలుగుతుంది. ఇది ఆటోమోటివ్ లెధర్‌తో తయారు చేయబడి, అల్యూమినియం ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది.
5. స్టోరేజ్ సదుపాయం కలిగిన ఆర్మ్ రెస్ట్: ఇది డ్రైవింగ్ కంఫర్ట్‌ను పెంచేందుకు సహకరిస్తుంది. అంతేకాకుండా, కళ్లజోళ్లు, వ్యాలెట్స్, ఫోన్స్ వంటి చిన్న వస్తువులను స్టోర్ చేసుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications









