ఫియస్టా సెడాన్ కోసం ఫోర్డ్ ఆఫర్ చేస్తున్న యాక్ససరీలు-2
7. లెథర్ స్టీరింగ్ వీల్-ప్లమ్ (ఆడియో కంట్రోల్స్): ఆటోమోటివ్ లెథర్ క్రాఫ్ట్ చేయబడిన స్టీరింగ్ వీల్ కవర్ సుపీరియర్ క్వాలిటీని కలిగి ఉండి మంచి గ్రిప్‌ను అందిస్తుంది. ఫలితంగా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.
8. ఫ్రంట్ ఫాగ్‌ల్యాంప్స్ కిట్: మంచు కురిసే వేళల్లో సురక్షితంగా డ్రైవింగ్ చేసేందుకు సహకరిస్తుంది.
9. చైల్డ్ సీట్: కొత్తగా జన్మించిన పసిపిల్లలను కారులో సురక్షితంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
10. స్పోర్టీ ఎయిర్ డ్యామ్, ఫ్రంట్ బంపర్: క్రోమ్ కోటింగ్ కలిగిన ఫ్రంట్ బంపర్ ఫియస్టాకు మంచి స్పోర్టీ లుక్‌ను ఇచ్చి మరింత స్టయిలిష్‌గా కనిపించేదుకు ఉపయోగపడుతుంది.
ఇవేకాకుండా.. కార్పెట్ ఫ్లోర్ మ్యాట్స్, నోకియా బ్లూటూత్ హ్యాండ్స్‌ఫ్రీ కిట్స్, హుపరోప్టిక్ సన్‌ఫిల్మ్స్, గార్వారే సన్‌ఫిల్మ్స్, వ్యాక్సైల్ కార్ ట్రీట్‌మెంట్స్, 3ఎమ్ కార్ ట్రీట్‌మెంట్స్, ఫోర్డ్ ఫిల్లోస్, నెక్ రెస్ట్స్, సీట్ బెల్ట్ ప్యాడ్స్, కార్ కవర్స్, కార్ రిఫ్రిజిరేటర్ తదిరత యాక్ససరీలను కూడా ఫోర్డ్ ఆఫర్ చేస్తుంది. ఈ యాక్ససరీలను కొనుగోలు చేయాలన్నా లేదా మీ కారుకు ఫిట్ చేయించుకోవాలన్నా, సదరు యాక్ససరీను ప్రింట్ అవుట్ తీసుకుని మీ సమీపంలోని ఫోర్డ్ డీలర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications









