మాస్ట్రో 110సీసీ స్కూటర్‌ను విడుదల చేసిన హీరో మోటోకార్ప్
హీరో మాస్ట్రో స్కూటర్ విడుదల ఫోటోలు
ప్రస్తుతం హీరో మోటోకార్ప్ దేశీయ విపణిలో ఒకేఒక్క స్కూటర్ (ప్లెజర్)ను మాత్రమే అందిస్తోంది. మాస్ట్రో రాకతో హీరో స్కూటర్ ప్రోడక్ట్‌ఫోలియో రెండుకు పెరిగింది. హోండా అందిస్తున్న యాక్టివా స్కూటర్‌ను సవాల్ చేస్తూ హీరో తమ మాస్ట్రో స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. వాస్తవానికి హోండా యాక్టివా ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే మాస్ట్రో స్కూటర్‌ను తయారు చేయటం జరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే హోండా యాక్టివాకు రీబ్యాడ్జ్ చేయబడిన వెర్షన్.
హీరో మాస్ట్రోలో 109సీసీ, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఓహెచ్‌సి ఇంజన్ ఉపయోగించారు. (హోండా యాక్టివాలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు). ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.2 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 9.10 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. హీరో మాస్ట్రో స్కూటర్ 1,240 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉండి, 155 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.
దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5.3 లీటర్లు. ఇది లీటరు పెట్రోల్‌కు సుమారు 60 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. హీరో మాస్ట్రో స్కూటర్ పాంథర్ బ్లాక్, పెరల్ వైట్, బ్లేజింగ్ రెడ్, ఎలక్ట్రిక్ బ్లూ, ఫోర్స్ సిల్వర్, హార్వెస్ట్ గ్రీన్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది.
హీరో మాస్ట్రో 110సీసీ స్కూటర్‌లో లభించే ఫీచర్ల వివరాల కోసం నెక్స్ట్ (Next)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications









