మే నెలలో మార్కెట్లోకి రానున్న హ్యోసంగ్ జిటి250ఆర్
సుమారు రూ.2.25 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర ఉండేలా జిటి250ఆర్ సూపర్‌బైక్‌ను వచ్చే మే నెలలో మార్కెట్లోకి తీసుకువస్తామని కంపెనీ పేర్కొంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రెజిల్, అమెరికా వంటి మార్కెట్లలో ఈ మోడల్‌కు మంచి ఆదరణ ఉందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, వచ్చే సెప్టెంబర్ నాటికి హ్యోసంగ్ జివి 650, హ్యోసంగ్ జివి 250 మోడళ్లను కూడా మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.
భారత మార్కెట్లో 250సీసీ విభాగంలో అపార అవకాశాలున్నాయని ఎస్&టి మోటార్స్ అధీకృత డిస్ట్రిబ్యూటర్ అయిన గార్వారే మోటార్స్ జనరల్ మేనేజర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శివపాద రే తెలిపారు. 2013లో 5 వేల 250సీసీ బైక్‌లను, 600 నుండి 800 యూనిట్ల 650సీసీ బైక్‌లను విక్రయిస్తామని ఆయన అంచనా వేశారు. 250సీసీ బైక్‌లను సికెడి (కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్) రూట్లో విడిభాగాలను దిగుమతి చేసుకుని దేశీయ విపణిలో అసెంబ్లింగ్ చేయనున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర విపణిలో హ్యోసంగ్ జిటి 650ఎన్, హ్యోసంగ్ జిటి 650, హ్యోసంగ్ ఎస్‌టి7 మోడళ్లు లభిస్తున్నాయి. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ రోడ్‌లో హ్యోసంగ్ బైక్‌ల కోసం గార్వారే మోటార్స్ ఓ కొత్త షోరూమ్‌ను ఇటీవలే ప్రారంభించింది.


Click it and Unblock the Notifications









