కొత్త పల్సర్ కోసం బుకింగ్స్ తీసుకుంటున్న బజాజ్ డీలర్లు

బజాజ్ ఆటో విడుదల చేసిన కొత్త పల్సర్ 200 ఎన్ఎస్ మోడల్ కోసం, కంపెనీ ఏప్రిల్ నెలలో బుకింగ్‌లను ప్రారంభించనున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌ స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం, కొందరు ప్రముఖ బజాజ్ డీలర్లు పల్సర్ 200 ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ కోసం అనధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించారు.

మా డ్రైవ్ స్పార్క్ ప్రతినిధి ఒకరు స్థానిక బజాజ్ షోరూమ్‌లో విచారించగా ఈ విషయం వెల్లడైంది. గతంలో మా ప్రతినిధి ఒకరు బజాజ్ అధికారిని సంప్రదించినప్పుడు కూడా ఏప్రిల్ నెలలో కొత్త పల్సర్ కోసం బుకింగ్‌లను ప్రారంభిస్తామని సదరు అధికారి సమాధానమిచ్చారు. అయితే, ఇందుకు సంబంధించిన ఓ ఖచ్చితమైన తేదీని వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.

మొత్తమ్మీద ఇది పల్సర్ ప్రియులకు తీపి వార్తగా చెప్పుకోవచ్చు. ఈ నెలాఖరు చివరి నాటికి 2012 పల్సర్ 200 ఎన్ఎస్ బైక్‌ డెలివరీ అయ్యే ఆస్కారం ఉంది. 'పల్సర్ 200ఎన్ఎస్' (నేక్‌డ్ స్పోర్ట్స్)లో ప్రపంచంలోనే తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన 199.5సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.4 బిహెచ్‌పిల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 1.86 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

పల్సర్ 200ఎన్ఎస్ బైక్ కేవలం 3.8 సెకన్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది, అలాగే 9.8 సెకన్లలో 0-100 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది గంటకు గరిష్టంగా 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. కొత్త 2012 పల్సర్ 200ఎన్ఎస్ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ (గంటకు 55 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు మాత్రమే) మైలేజీనివ్వనుంది. మరింకెందుకు ఆలస్యం కొత్త వెంటనే మీ సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి కొత్త పల్సర్ బుకింగ్స్ గురించి విచారించండి.

ఇది కూడా చదవండి..: పల్సర్ 135, యమహా ఆర్15 వెర్షన్ 2.0, కెటిఎమ్ డ్యూక్ 200 మోడళ్లను కాపీ కొట్టి పల్సర్ 200 ఎన్ఎస్ మోడల్‌ను డిజైన్ చేశారా..?

More from DriveSpark

Article Published On: Monday, April 2, 2012, 17:56 [IST]
English summary
The wait for the Bajaj 200 NS will be soon over. The new 2012 Bajaj Pulsar 200 NS is anticipated to be launched later this month. According to latest reports, a few Bajaj dealers have already open the bookings for the Pulsar 200 NS.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+