కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్‌గా చెప్పుకునే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు ప్రస్తుతం మోడల్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్ 6 నెలల నుంచి 8 నెలల మధ్యలో ఉంది. కంపెనీ బైకర్ల కోసం లెథర్ జాకెట్లు, నైలాజ్ జాకెట్లు, హెల్మట్లు, గ్లౌజ్‌లు, గ్యాడ్జెట్లు వంటి యాక్ససరీలను కూడా అందిస్తోంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో చెన్నైలోని రెండవ ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా తమ మోడళ్లకు ఉన్న దీర్ఘకాల వెయింటిగ్ పీరియడ్‌ను తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. మొట్టమొదటి థండర్‌బర్డ్ 350సీసీ వేరియంట్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ 2002 సంవత్సరంలో మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుంచి థండర్‌బర్డ్ దేశీయ విపణిలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500సీసీ వేరియంట్ ఫీచర్లు:
- ఇంజన్ టైప్ - సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ట్విన్‌స్పార్క్, ఎయిర్-కూల్డ్
- ఇంజన్ సీసీ - 499సీసీ
- గరిష్ట పవర్ - 27.2 బిహెచ్‌పి @ 5250 ఆర్‌పిఎమ్
- గరిష్ట టార్క్ - 41.3 ఎన్ఎమ్ @ 4000 ఆర్‌పిఎమ్
- ఫ్యూయెల్ ట్యాంక్‌పై విశిష్టమైన బ్లాక్ స్టయిలింగ్, 3డి స్టిక్కరింగ్
- ప్రొజెక్టర్, ఎల్ఈడి లైట్ గైడ్ హ్యాలో రింగ్‌తో కూడిన హెడ్‌ల్యాంప్
- రెండు ఇండిపెండెంట్ ట్రిప్ మీటర్లు, డిజిటల్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్
- స్ప్లిట్ సీట్ (విడిపోయినట్లుగా ఉండే సీట్)
- వెనుక సీట్లో కూర్చునే పిలియన్ రైడర్‌కు సౌకర్యం కలిగించేందుకు ఏర్పాటు చేసిన బ్యాక్ రెస్ట్, దీనిని లగేజ్ క్యారియర్ కూడా ఉపయోగించుకోవచ్చు
- వెనుక చక్రానికి ఏర్పాటు చేసిన డిస్క్ బ్రేక్
- ఈఎల్ఈడి టెయిల్ ల్యాంప్
- అవసరం లేదనుకున్నప్పుడు మడుచుకునే వీలున్న రియర్ ఫుట్ రెస్ట్స్
- బ్లాక్ కోటింగ్‌తో కూడిన ఇంజన్
- రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 - రూ.1.83 లక్షలు (ఆన్-రోడ్)


Click it and Unblock the Notifications









