రాష్ట్ర మార్కెట్లో కొత్త థండర్‌బర్డ్‌ని విడుదల చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. బెల్లెట్ మోటార్‌సైకిళ్లు తయారు చేయటంలో ప్రసిద్ధి గాంచిన, చెన్నైలోని ఐషర్ గ్రూపుకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి బైక్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త సెకండ్ జనరేషన్ థండర్‌బర్డ్ రాష్ట్ర మార్కెట్లోకి విచ్చేసింది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ రెండు వేరియంట్లలో(500సీసీ, 350సీసీ) లభ్యమవుతుంది. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు, అడ్వెంచర్ రైడ్‌లు చేసే వారిని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త థండర్‌బర్డ్ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేశామని, వారి ప్రయాణాల్లో ఈ కొత్త థండర్‌బర్డ్ సరికొత్త అనుభూతులను అందిస్తుందని కంపెనీ సీనియర్‌ వైస్ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) షాజీ కోషీ తెలిపారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350సీసీ వేరియంట్ ఫీచర్లు:

  • ఇంజన్ టైప్ - సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ట్విన్‌స్పార్క్, ఎయిర్-కూల్డ్
  • ఇంజన్ సీసీ - 346సీసీ
  • గరిష్ట పవర్ - 19.8 బిహెచ్‌పి @ 5250 ఆర్‌పిఎమ్
  • గరిష్ట టార్క్ - 28 ఎన్ఎమ్ @ 4000 ఆర్‌పిఎమ్
  • ఫ్యూయెల్ ట్యాంక్‌పై విశిష్టమైన బ్లాక్ స్టయిలింగ్, 3డి స్టిక్కరింగ్
  • స్ప్లిట్ సీట్ (విడిపోయినట్లుగా ఉండే సీట్)
  • వెనుక సీట్లో కూర్చునే పిలియన్ రైడర్‌కు సౌకర్యం కలిగించేందుకు ఏర్పాటు చేసిన బ్యాక్ రెస్ట్, దీనిని లగేజ్ క్యారియర్ కూడా ఉపయోగించుకోవచ్చు
  • వెనుక చక్రానికి ఏర్పాటు చేసిన డిస్క్ బ్రేక్
  • మెరుగైన షాషీ (ఛాస్సిస్), ఫ్రంట్ ఫోర్క్స్, 18 ఇంచ్ టైర్స్, డిస్క్ బ్రేక్ మరియు మెరుగైన సస్పెన్షన్
  • అవసరం లేదనుకున్నప్పుడు మడుచుకునే వీలున్న రియర్ ఫుట్ రెస్ట్స్
  • బ్లాక్ కోటింగ్‌తో కూడిన ఇంజన్
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350 - రూ.1.43 లక్షలు (ఆన్-రోడ్)

More from DriveSpark

Article Published On: Monday, October 15, 2012, 10:43 [IST]
English summary
Chennai-based two-wheeler manufacturer Royal Enfield has launched the second generation Thunderbird 500 & 350 models Hyderabad. The engine on the Thunderbird 500 is capable of churning out 27.2 bhp 5250 rpm and 41.3 Nm of torque at 4000 rpm.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+