అభిమానికి సుజుకి హయాటే బహుమతిగా ఇచ్చిన సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన అభిమానికి బైక్‌ను బహుమతిగా ఇచ్చిన తన పెద్ద మనస్సును చాటుకున్నాడు. సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న తాజా చిత్రం 'ఏక్ థా టైగర్' ప్రమోషన్‌లో భాగంగా, ఆయన పాపులర్ టెలివిజన్ షో 'ఇండియన్ ఐడల్' సెట్స్‌పై కనిపించారు. ఈ షోలో సల్మాన్ ఖాన్‌కు వీరాభిమాని అయిన ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్ అమిత్ కుమార్‌కు ఓ సుజుకి హయాటే మోటార్‌సైకిల్‌ను బహుమతిగా ఇచ్చాడు.

ఈ షోలో పాల్గొన్న అమిత్‌ను బైక్‌ల పట్ల తన ప్యాషన్ గురించి సల్మాన్ ఖాన్ అడిగాడు. దానికి సమాధానంగా అమిత్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు తాను తన స్నేహితుడి సైకిల్‌పై స్కూల్‌కు వెళ్లే వాడినని, కాలేజ్ సమయంలో తన తండ్రి తనకోసం బైక్ కొనిపెట్టాడని చెప్పుకొచ్చాడు. ఇది విన్న సల్మాన్ ఖాన్ టక్కున పైకి లేచి తన చేతిలో ఉన్న సరికొత్త సుజుకి హయాటే మోటార్‌సైకిల్‌ తాళం చెవులను అమిత్ వైపుకు విసిరేశాడు. కొత్త బైక్‌ను పొందిన అమిత్ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు.


జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ తాజాగా ప్రవేశపెట్టిన 110సీసీ సుజుకి హయాటే బైక్‌కు సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇదంతా సల్మాన్ ఖాన్ తన లేటెస్ట్ చిత్రం ఏక్ థా టైగర్ ప్రమోషన్‌లో భాగంగా చేశారనే వాగనలు కూడా ఉన్నాయి. ఈ చిత్ర ప్రమోషన్ కోసం సుజుకి ఇప్పటికే ఓ స్పెషల్ క్యాంపైన్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

'ఏక్ థా టైగర్, ఏక్ హై హయాటే' అనే ప్రమోషన్ క్యాంపైన్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ 360-డిగ్రీ క్యాంపైన్ టెలివిజన్, రేడియో, ప్రింట్ మీడియాల్లో ప్రసారం అవుతోంది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ఆరుగురు విజేతలు ముంబైలో సల్మాన్ ఖాన్‌ను కలుసుకునే అవకాశం కల్పించబడుతుంది. అంతేకాకుండా, ఇందులో ఒకరు సుజుకి హయాటేను ఉచితంగా పొందే అవకాశం కూడా ఉంటుంది.

సుజుకి హయాటే ఫోటో గ్యాలరీ:

సుజుకి హయాటే మోటార్‌సైకిల్ విషయానికి వస్తే.. స్టయిలిష్ లుక్, ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్‌తో తీర్చిదిద్దిన ఈ బైక్‌లో పవర్‌ఫుల్ 112.8సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 4-స్పీడ్ గేర్ బాక్స్ (అన్ని గేర్లు క్రింది వైపుకు), 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి విశిష్ట ఫీచర్లతో ఇది లభిస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 70 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇంకా ఇందులో సింగిల్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్ (షాషీ)కు ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెషన్, వెనుక వైపు 5-వే అడ్జస్టబల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్‌లను అమర్చారు. రాష్ట్ర మార్కెట్లో సుజుకి హయాటే కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.40,271 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) గాను సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.42,271 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) గాను ఉంది. సుజుకి హయాటే వైట్, గ్రీన్, గ్రే, రెడ్, బ్లాక్ కలర్స్‌లో లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 10, 2012, 16:21 [IST]
English summary
Superstar Salman Khan is famous for his big heart and generous nature. Salman Khan recently visited the sets of Indian Idol to promote his movie Ek Tha Tiger. The superstar gifted the contestant of Indian Idol Amit Kumar, who is Salman Khan's huge fan, a brand new bike.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+