మైలేజ్‌లో మాస్టర్.. హోండా డ్రీమ్ యుగ 110సీసీ బైక్
ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో కొనుగోలుదారులు ఎక్కువ మైలేజీనిచ్చే బడ్జెట్ మోటార్‌సైకిళ్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి వారికి ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న మోటార్‌సైకిళ్లలో ఓ చక్కటి టూవీలర్ ఆప్షన్‌లలో "హోండా డ్రీమ్ యుగ" కూడా ఒకటి. గడచిన మే మధ్య భాగంలో మార్కెట్లో జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా విడుదల చేసిన డ్రీమ్ యుగ 110సీసీ మోటార్‌సైకిల్ ఇటు ధర పంరంగానూ అటు మైలేజ్ పంరంగానూ అందరికీ అందుబాటులో ఉంది.
హోండా కంపెనీ అందిస్తున్న ఇంజన్లకు సాటి మరొకటి లేదన్ చెప్పాలి. ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండటంతో పాటు మెయింటినెన్స్ ఖర్చు పరంగా కూడా బడ్జెట్‌లోనే ఉండటం వీటి ప్రత్యేకత. అందుకే హోండా టూవీలర్లకు మార్కెట్లో అంతటి డిమాండ్. సరే హోండా డ్రీమ్ యుగ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్‌కు 72 కి.మీ. మైలేజీనిచ్చే విధంగా తీర్చిదిద్దబడిన ఈ బైక్ కేవలం రూ.46968 (ప్రారంభ మోడల్ ధర, ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)లకే లభిస్తుంది.
హోండా డ్రీమ్ యుగ ప్రధాన ఫీచర్లు:
1. ఎరోడైనమిక్ ఫ్రంట్ కౌల్: ముందువైపు డిజైన్ చేయబడిన హెడ్‌లైట్ డోమ్ బైక్‌కు మంచి లుక్‌నివ్వటమే కాకుండా, మంచి రైడ్ హ్యాండ్లింగ్‌ను కూడా అందిస్తుంది.
2. స్టయిలిష్ గ్రాబ్ రెయిల్: బైక్ వెనుక వైపు బ్రేక్ లైట్ పైభాగంలో అమర్చబడిన బాడీ కలర్‌లో ఉండే గ్రాబ్ రెయిల్ అల్యూమినియంతో చేయబడినది. ఇది తక్కువ బరువును కలిగి ఉంటడమే కాకుండా పటిష్టంగా కూడా ఉంటుంది.
3. ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్: ఫ్యూయెల్ ట్యాంక్, సైడ్ కౌల్ (ప్యానెల్స్)పై డిజైన్ చేయబడిన స్టయిలిష్ గ్రాఫిక్స్ ఇతరల దృష్టిని మరోసారి మీ బైక్‌వైపుకు తిప్పుకునేలా చేస్తుంది.
4. విస్కౌస్ ఎయిర్ ఫిల్టర్: దీర్ఘకాలం మన్నిక కలిగిన విస్కౌస్ ఎయిర్ ఫిల్టర్ ఉండటం వలన దీనిని తరచూ శుభ్రం చేయాల్సిన అవసరం లేదు.
5. ఫైవ్-స్టెప్ అడ్జస్టబల్ రియర్ సస్పెన్షన్: ఈ బైక్‌కు వెనుక వైపు అమర్చబడిన 5-స్టెప్ అడ్జస్టబల్ సస్పెన్షన్‌ను రోడ్డు, లోడ్ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. 94 మి.మీ. పొడవు ఉండే ఈ సస్పెన్షన్ వలన ఎలాంటి రోడ్లపై అయినా సరే స్మూత్ రైడ్ అనుభూతిని పొందవచ్చు.
6. పొడవాటి సీట్: దీని పొడవైన మరియు విశాలమైన సీట్ ఇటు రైడర్‌కు అటు వెనుక కూర్చునే పిలియన్ రైడర్‌కు మంచి సౌకర్యాన్ని కలిగిస్తుంది.
7. ఫ్రంట్ సస్పెన్షన్: ముందు వైపు అమర్చిన 120మి.మీ. షాక్ అబ్జార్వర్లు రైడర్‌కు కంఫర్ట్ రైడ్ అనుభూతిని కలిగిస్తాయి.
8. 11సీసీ ఇంజన్: హోండా ఇంటలిజెంట్ ఇగ్నిషన్ కంట్రోల్ సిస్టమ్‌తో కూడిన రీడిఫైన్డ్ 110సీసీ ఇంజన్ సూపర్ పవర్‌ను, టార్క్‌ను విడుదల చేసి మంచి యాక్సిలరేషన్‌ను అందిస్తుంది.
9. ట్యూబ్‌లెస్ టైర్లు: హోండా డ్రీమ్ యుగ ట్యూబ్‌లెస్ టైర్లతో లభిస్తుంది. టైరుకు చిన్న చిన్న పంక్చర్లు జరిగినప్పుడు టైరులోని గాలి మొత్తం బయటు వెళ్లిపోకుండా ఈ ట్యూబ్‌లెస్ టైర్లు సహకరిస్తాయి.
హోండా డ్రీమ్ యుగ ఫీచర్లు, ధరలు, స్పెసిఫికేషన్ల వివరాల కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications









