బైకర్ల కోసం 'ధూమ్ 3' హెల్మెట్లను విడుదల చేసిన స్టీల్‌బర్డ్

By Ravi

గతంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన రావన్ చిత్రం విడుదలైనప్పుడు వివిధ కంపెనీలు ఆ సినిమాను టార్గెట్ చేసుకొని సరికొత్త ఉత్పత్తులను మార్కెటింగ్ చేయటాన్ని మనం చూశాం. ఇప్పుడు తాజాగా.. మరో బాలీవుడ్ సూపర్ హీరో అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3 చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న నేపథ్యంలో, స్టీల్‌‌బర్డ్ సరికొత్త 'ధూమ్ 3' సిరీస్ హెల్మెట్లను విడుదల చేసింది.

ధూమ్ 3 సినిమా క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు స్టీల్‌‌బర్డ్ ఈ కొత్త స్టయిలిష్ హెల్మెట్లను తయారు చేసింది. ఈ మేరకు స్టీల్‌బర్డ్ యష్ రాజ్ ఫిల్మ్స్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చొకని ఈ హెల్మెట్లను అధికారికంగా తయారు చేస్తోంది. ఈ సందర్భంగా, యష్ రాజ్ ఫిల్మ్స్ లైసెన్సింగ్ అండ్ మర్చండైస్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ సోబ్టీ మాట్లాడుతూ.. కొత్త ధూమ్ 3 రేంజ్ హెల్మెట్లపై ఈ సినిమాను ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన ఆకర్షనీయమైన గ్రాఫిక్స్ ప్రత్యేకంగా నిలుస్తాయని, బైకర్లకు ఇవి మంచి థ్రిల్‌నిస్తాయని అన్నారు.

ఇది కూడా చదవండి: ధూమ్ 3లో అమీర్, అభిషేక్‌ల బైక్ స్టంట్స్

Dhoom 3 Helmet

ఈ సందర్భంగా స్టీల్‌బర్డ్ హై-టెక్ ఇండియా లిమిటెడ్ హెడ్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శైలేంద్ర జైన్ మాట్లాడుతూ.. యష్ రాజ్ ఫిల్మ్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవటం తమకెంతో సంతోషంగా ఉందని, వినూత్న ఉత్పత్తులను తయారు చేయటంలో ఎప్పుడూ ముందుండే తాము, తాజాగా ధూమ్ 3 ఉత్పత్తులను పరిచయం చేశామని, ప్రస్తుతం తాము అందిస్తున్న హెల్మెట్లకు అదనంగా ఇవి లభ్యం కానున్నాయని చెప్పారు. స్టీల్‌బర్డ్ హెల్మెట్లు సేఫ్టీకి, నాణ్యతకి పెట్టింది పేరని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 19, 2013, 15:56 [IST]
English summary
Helmet manufacturer, Indo Italian collaboration of Steelbird-Bieffe has announced that they have partnered with the producers of all new Dhoom 3 movie and launched a new range of Dhoom 3 helmets.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+