స్కూటీ జెస్ట్ స్కూటర్‌ను విడుదల చేయనున్న టీవీఎస్
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న దేశీయ ద్విచక్ర వాహన సంస్థ 'టీవీఎస్ మోటార్ కంపెనీ' ఇటీవలే అబ్బాయిల కోసం 'టీవీఎస్ జూపిటర్' అనే 110సీసీ ఆటోమేటిక్ స్కూటర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. వచ్చే ఏడాది ఆరంభంలో ప్రత్యేకించి అమ్మాయిల కోసం 'టీవీఎస్ స్కూటీ జెస్ట్' (TVS Scooty Zest) అనే కొత్త స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఈ సెగ్మెంట్లో నేరుగా యమహా రే ఆటోమేటిక్ స్కూటర్‌తో పోటీ పడనుంది. ధర విషయంలో కూడా ఇది యమహా రే కన్నా తక్కువకే లభ్యమయ్యే అకాశం ఉంది. టీవీఎస్ స్కూటీ జస్ట్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. అయితే, డిజైన్, బాడీ గ్రాఫిక్స్‌తో పాటు మరికొన్ని సరికొత్త ఫీచర్లను ఈ స్కూటర్లో జోడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్కూటీ పెప్‌కు ఇప్పటికే అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ స్కూటర్ చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, దీని లైట్ వెయిట్ నిర్మాణం హ్యాండ్లింగ్‌కు కూడా చాలా సులువుగా ఉంటుంది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో స్కూటర్లకు మంచి గిరాకీ ఏర్పడుతోంది. అందుకే, ద్విచక్ర వాహన కంపెనీలన్నీ ఇప్పుడు స్కూటర్ల తయారీపై దృష్టి సారించాయి.
టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఆటోమేటిక్ స్కూటర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‍స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.
ఇది కూడా చదవండి: టీవీఎస్ జూపిటర్ స్కూటర్ విడుదల; ధర, ఫీచర్లు


Click it and Unblock the Notifications








