నవంబర్ నెలలో కొనసాగిన యమహా జోరు..!
జపాన్‌కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ బైక్‌ల తయారీ సంస్థ యమహా మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న ద్విచక్ర వాహనాలకు మంచి డిమాండ్ లభిస్తోంది. ఆకర్షనీమైన లుక్, పవర్‌ఫుల్ ఇంజన్ మరియు స్టైలిష్ డిజైన్లలో యమహా అందిస్తున్న స్పోర్ట్స్ బైక్‌లను అలాగే కంపెనీ ఇటీవలే విడుదల చేసిన రే, రే జెడ్ స్కూటర్లనుభారతీయ వినియోగదారులు చక్కగా ఆదరిస్తుండటంతో కంపెనీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు అంతగా బాగోలేనప్పటికీ, గడచిన నవంబర్ నెలలో కూడా యమహా ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసుకుంది. నవంబర్ 2012తో పోల్చుకుంటే, నవబర్ 2013లో యమహా మోటార్ ఇండియా అమ్మకాలు 7 శాతం వృద్ధి చెంది 37,344 యూనిట్ల నుంచి 39,777 యూనిట్లకు పెరిగాయి. అయితే, ఇదే సమయంలో కంపెనీ ఎగుమతులు మాత్రం 137 శాతం పెరిగాయి. నవంబర్ 2013లో యమహా 17,383 యూనిట్లను ఎగుమతి చేసింది. నవంబర్ 2012లో ఈ సంఖ్య 7,344 యూనిట్లుగా ఉంది.
ఇది కూడా చదవండి: యమహా రే ఫెమినా మిస్ ఇండియా 2013 ఫొటోలు
ఈ సందర్భంగా, ఇండియా యమహా మోటార్ నేషనల్ బిజినెస్ హెడ్ రాయ్ కురియెన్ మాట్లాడుతూ.. తమ పటిష్టమైన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో, వినియోగదారుల విశ్వసనీయత మరియు స్కూటర్ సెగ్మెంట్లో కొత్త ఉత్పత్తుల విడుదలతో గడచిన నెలలో కూడా ప్రోత్సాహకర వృద్ధిని కళ్లజూసామని, భవిష్యత్తులోనూ ఇదే విధమైన వృద్ధిని కనబరచగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
యమహా తొలిసారిగా 1985లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. యమహా ఇండియాకు ఉత్తరప్రదేశ్‌లోని సర్జాపూర్, హర్యానాలోని ఫరీదాబాద్‌లలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఈ ప్లాంట్లలో తయారైన మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా, పొరగు దేశాలకు కూడా కంపెనీ ఎగుమతి చేస్తుంది. యమహాకు దేశవ్యాప్తంగా 400 లకు పైగా డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి.
ప్రస్తుతం యమహా దేశీయ విపణిలో విమ్యాక్స్ (1,679cc), వైజెడ్ఎఫ్-ఆర్1 (998cc), ఎఫ్‌జెడ్1 (998cc), ఫేజర్ (153cc), ఎఫ్‌జెడ్-ఎస్ (153cc), ఎఫ్‌జెడ్ (153cc), ఎస్‌జెడ్-ఎక్స్ & ఎస్‌జెడ్-ఆర్ (153cc), వైజెడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0 (150cc), ఎస్ఎస్125 (123cc), వైబిఆర్ 125 (123cc), వైబిఆర్ 110 (106cc), క్రక్స్ (106cc) మరియు రే (113cc) స్కూటర్లను విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications









