హోండా యాక్టివా వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు ఉత్పత్తి పెంపు

By Ravi

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న యాక్టివా స్కూటర్‌కు భారీ గిరాకీ ఉన్న సంగతి తెలిసినదే. అధిక మైలేజీనిచ్చే బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్‌గా నిలిచిన హోండా యాక్టివా విషయంలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యానికి మించి డిమాండ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో, యాక్టివా వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు హోండా ఈ స్కూటర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుంది.

ప్రస్తుతం హోండా తమ యాక్టివా బ్రాండ్ క్రింద యాక్టివా, యాక్టివా ఐ అనే రెండు 110సీసీ స్కూటర్లను మరియు యాక్టివా 125 అనే ఓ 125సీసీ స్కూటర్‌ను అందిస్తోంది. ఇందులో రెగ్యులర్ యాక్టివా మరియు యాక్టివా ఐ స్కూటర్లకు వెయిటింగ్ పీరియడ్ ఒక వారం నుంచి రెండు వారాల మధ్యలో ఉండగా, 125సీసీ స్డాండర్డ్ వేరియంట్ యాక్టివాకు 3 నెలలు, డీలక్స్ వేరియంట్‌కు 6 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటోందని డీలర్లు చెబుతున్నారు.

honda to increase activa production to reduce waiting period

మరోవైపు రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో కొనుగోలు సెంటిమెంట్ బలంగా ఉంటుంది కాబట్టి మరిన్ని ఆక్టివా స్కూటర్లకు ఆర్డర్లు రావచ్చని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా భావిస్తోంది. హోండా యాక్టివా స్కూటర్‌ను తొలిసారిగా 2001లో మార్కెట్లోకి తెచ్చామని, అప్పటి నుంచి ఇది మంచి అమ్మకాలు సాధిస్తోందని హెచ్‌ఎమ్ఎస్‌ఐ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యధ్‌విందర్ ఎస్. గులేరియా తెలిపారు.

ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చి 14 ఏళ్లు అయినప్పటికీ, ఇప్పటికీ ఈ స్కూటర్‌కు వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతోందని, తమ యాక్టివా స్కూటర్ విషయంలో వినియోగదారులు ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. హోండా యాక్టివా వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు బెంగళూరులోని మూడోప్లాంట్‌లో యాక్టివా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్ గులేరియా వివరించారు.

honda to increase activa production

జూలై-సెప్టెంబర్ కాలానికి రోజువారీ ఉత్పత్తి 15-20 శాతం పెంచామని, ఏప్రిల్-జూలై కాలానికి ఎంక్వైరీలు 30 శాతం పెరగాయని, ఇదే సమయంలో అమ్మకాలు 33 శాతం వృద్ధి చెందాయని ఆయన పేర్కొన్నారు. వివిధ మోడళ్లకు సంబంధించి పెండింగ్ ఆర్డర్లు ఇప్పటివరకూ 60,000 ఉన్నాయని, వీటిల్లో 70 శాతం ఆక్టివా స్కూటర్‌వేనని గులేరియా తెలిపారు.

కాగా గత నెలలో హీరో మోటోకార్ప్ బెస్ట్ సెల్లింగ్ బైక్ స్ప్లెండర్ అమ్మకాల(1,65,779)ను ఈ యాక్టివా స్కూటర్ విక్రయాలు (1,91,883) అధిగమించిన సంగతి తెలిసినదే. హోండా యాక్టివా నంబర్‌వన్ టూవీలర్‌గా నిలిచిందని, గడచిన 11 నెలల కాలంలో హీరో స్ప్లెండర్ అమ్మకాలను హోండా యాక్టివా అమ్మకాలు మొత్తం మూడు సార్లు అధిగమించాయని గులేరియా పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, August 16, 2014, 10:46 [IST]
English summary
Honda Activa automatic scooter waiting period is expected come down as the Japanese two wheeler maker has increased the production capacity of the India’s best selling scooter at its new factory in Narsapura, Karnataka.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+