బజాజ్ నుండి పల్సర్ 200యన్‌యస్ అప్‌డేటెడ్ మోడల్: ఇంజన్, స్పెసిఫికేషన్స్...
బజాజ్ ఆటో వారు తమ పల్సర్ 200యన్‌యస్ అప్‌డేటెడ్ మోడల్‌ను అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బజాజ్ పల్సర్ 200యన్‌యస్ మోడల్లో ఇంజన్ మరియు కొన్ని ఇతర మార్పులతో మన ముందుకు రానుంది.
Also Read: హోండా నుండి సిబియస్ ఐఎక్స్50 కాన్సెప్ట్ బైక్ విడుదల
బజాజ్ వారు దీనిని 2012 లోనే విడుదల చేశారు.కాని అనుకోని కారణాల వలన దీని ఉత్పత్తిని అప్పట్లో నిలిపివేశారు. అయితే అప్పుడు విడుదల చేసిన ఈ 200యన్‌యస్ మోడల్‌కే స్వల్ప మార్పులుతో కొన్ని ఇతర ఫీచర్లు జోడించి మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీనికి సంభందించిన ఇతర వివరాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

2016 నాటికి
బజాజ్ సంస్థ ఈ అప్‌గ్రేటెడ్ పల్సర్ 200యన్‌యస్ మోడల్ బైకును 2016 జూన్ నెలలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.

ఇంజన్
ఇందులో 199.5సీసీ గల సింగిల్ సిలిడర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్‌లో ఫ్యూయల్ ఇంజెక్షన్ మరియు మూడు స్పార్క్ ప్లగ్‌లు కలవు.

పవర్
ఇందులో గల ఇంజన్ దాదాపుగా 24.15బిహెచ్‌పి మరియు 18.6 యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో గల 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ మొత్తం పవర్‌ను వెనుక చక్రానికి అందివ్వడంలో సహాయపడుతుంది.

ధర
ఇంతకు ముందున్న పల్సర్ 200యన్‌యస్ మోడల్ కన్నా ఈ అప్‌గ్రేటెడ్ పల్సర్ 200యన్‌యస్ ధర ఎక్కువగానే ఉండవచ్చు. అయితే ప్రస్తుతం పల్సర్ 200యన్‌యస్ ధర రూ. 91,553 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) గా ఉంది.

డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్
ఈ సరికొత్త అప్‌గ్రేటెడ్ బజాజ్ పల్సర్ 200యన్‌యస్ కొన్ని కొత్త రంగుల్లో రానున్నట్లు తెలిపారు. ఒక రంగులో కాకుండా రెండు రంగుల కలయికలో ఇది రానుంది.

2016 ఆటో ఎక్స్-పోలో
బజాజ్ పల్సర్ 200యన్‌యస్ మోడల్‌ను 2016 ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో షోలో దీనిని ప్రదర్శించనుంది. అంతే కాకుండా ఈ ఆటో షో బజాజ్ సంస్థ మరిన్ని ఉత్పత్తులను ప్రదర్శించాలని నిర్ణయించింది.

- భారతదేశపు భవిష్యత్తు మోటార్ సైకిల్స్...ఇవి ఎలా ఉంటాయి ?
- మొట్టమొదటి 125సీసీ స్కూటర్‌ను పరిచయం చేసిన కవాసకి
- భారత్ మార్కెట్లోకి కవాసకి కెయల్ఎక్స్ 110 విడుదల: ధర


Click it and Unblock the Notifications








