హొయలొలికే హోండా యాక్టివా ఐ ఆవిష్కరణ
హోండా మోటార్ సైకిల్ మరియు స్కూటర్ ఇండియా సరికొత్త ఫీచర్స్, రంగులతో హొయలొలికే హోండా 2015 యాక్టివా ఐ ను ఆవిష్కరించింది. దీంతో పాటు పాత మోడళ్లను అభివృద్ధి చేసి భారత మార్కెట్లోకి విడుదల చేసే ఆలోచనలో ఉంది.
ఈ జపనీస్ బేస్డ్ ద్విచక్రవాహన కంపెనీ తన స్కూటర్ ను ఆభివృద్ధి చేసి కస్టమర్ల కోసం విడుదల చేసింది. హోండా యాక్టివా ఐ భారత్ లో సరికొత్త కలర్స్ మరియు రెండు వేరియంట్లలో లభ్యం కానుంది.

హోండా యాక్టివా ఐ ధరలు ఇలా ఉన్నాయి :
- హోండా యాక్టివా ఐ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.46,213 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
- హోండా యాక్టివా ఐ డీలక్స్ వేరియంట్ ధర రూ.46,213 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
యాక్టివా ఐ స్కూటర్ భారీ టార్గెట్ తో భారత మార్కెట్లో ప్రవేశించనుంది. అయితే ఈ స్కూటర్ జూన్,2015 చివరి నాటి వరకూ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. బుకింగ్స్ రానున్న నెల నుంచి ప్రారంభంకానున్నాయి.

- కాంబి బ్రేక్ సిస్టమ్.
- హోండా ఎకో టెక్నాలజీ.
- కొత్త ఇన్నర్ బాడీ.
- టెయిల్ లైట్.
- లాంగర్ సీట్.
- ఇన్ట్స్రుమెంట్ ప్యానల్.
- కాంప్యాక్ట్ లైట్ వెయిట్ డిజైన్.

- ఆల్ఫా మెటాలిక్ రెడ్ (స్టాండర్డ్).
- పెర్ల్ అమేజింగ్ వైట్ (స్టాండర్డ్).
- మెటాలిక్ బీజ్ (స్టాండర్డ్).
- బ్లాక్ (స్టాండర్డ్).
- పెర్ల్ అమేజింగ్ వైట్ (డీలక్స్).
- ఆర్చిడ్ పర్పుల్ మెటాలిక్ (డీలక్స్).
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......


Click it and Unblock the Notifications








