2016 సంవత్సరానికి బెస్ట్ మోటార్ సైకిల్ ఆవార్డు గెలుచుకున్న యమహా వైజడ్‌ఎఫ్-ఆర్3

By Anil

భారతీయ మార్కెట్లో యమహా వారు స్కూటర్ల దగ్గర నుండి స్పోర్ట్స్ బైకుల వరకు విభిన్ని ఉత్పత్తులను ప్రవేశ పెట్టారు. అయితే ఈ సంవత్సరం ఆగష్టులో విడుదల అయిన యమహా వారి వైజడ్‌ఎఫ్-ఆర్3 స్పోర్ట్స్ బైక్ ప్రతిష్టాత్మక ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. యమహా వారి సాంకేతిక ఆవిష్కరణలకు ఇదొక నిదర్శనం అని చెప్పవచ్చు.

ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రతిష్టాత్మకమైన ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఈ యేడు ముఖ్యంగా మూడు బైకులు పోటి పడినట్లు తెలిసింది. హోండా సిబిఆర్650యఫ్ మరియు డియస్‌కె బెనెల్లీ టియన్‌టి 300 మోడళ్లు ఈ యమహా వైజడ్‌ఎఫ్-ఆర్3 మోడల్‌కు గట్టి పోటిగా నిలిచాయి. అయితే ఈ అవార్డు యమహా వారి స్పోర్ట్ బైకును మాత్రమే వరించింది.

దీని గురించి మరింత సమాచారం.... క్రింది కథనంలో క్లుప్తంగా....

ఇంజన్

ఇంజన్

ఇందులో రెండు సిలిండర్లు గల ఇన్‌లైన్ లిక్విడ్ కూల్డ్ 321 సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌ను కలదు.

పవర్

పవర్

ఇది గరిష్టంగా 41.43 బిహెచ్‌పి పవర్ మరియు 29.6 ఎన్ఎమ్ అత్యధిత టార్క్ ఉత్పత్తి చేయగలదు మరియు దీని గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్లు.

 కొలతలు

కొలతలు

ఈ అవార్డుకు ఎంపిక చేసేవారు బైకులను అంగుళం అంగుళం క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అందులో కొలతలు, మరి ఈ వైజడ్‌ఎఫ్-ఆర్3 కొలతలు చూద్దాం రండి.

  • మొత్తం పొడవు: 2,090 ఎమ్ఎమ్
  • మొత్తం వెడల్పు: 720 ఎమ్ఎమ్
  • మొత్తం ఎత్తు: 1,135 ఎమ్ఎమ్
  • సీటు ఎత్తు: 780 ఎమ్ఎమ్
  • వీల్ బేస్: 1,380 ఎమ్ఎమ్
  • గ్రౌండ్ క్లియరెన్స్: 160 ఎమ్ఎమ్
  • మొత్తం బరువు: 169 కిలోలు
  • ఇంధన ట్యాంక్ సామర్థ్యం: 14 లీటర్లు.
  • బ్రేక్స్

    బ్రేక్స్

    ఇందులో భద్రత పరంగా ముందు వైపు 298 ఎమ్ఎమ్ గల సింగల్ డిస్క్ బ్రేక్ కలదు. మరియు వెనుకవైపున 220 ఎమ్ఎమ్ గల హైడ్రాలిక్ సింగల్ డిస్క్ బ్రేక్ కలదు. ముందు వైపున టెలిస్కోక్ సస్పెన్షన్ సిస్టమ్ కలదు. అయితే ఇందులో యాంటి-లాక్ బ్రేక్ సిస్టమ్ కల్పించలేదు.

    లభించు రంగులు

    లభించు రంగులు

    ఈ యమహా వైజడ్ఎఫ్-ఆర్3 స్పోర్ట్స్ బైకు కేవలం రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులో కలదు.

    • రేసింగ్ బ్లూ (Rasing Blue)
    • బ్లాక్ లైట్నింగ్ (Black Lightning)
    • మల్టీ ఫంక్షనల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్

      మల్టీ ఫంక్షనల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్

      మల్టీ ఫంక్షనల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ అనగా స్పీడో మీటర్ అనుకోండి, యమహా వారు ఇందులో రకరకాల ఆప్షన్లను ఇచ్చారు.

      • గేర్ పొజిషన్ ఇండికేటర్
      • ఫ్యూయల్ గేజ్
      • వాటర్ టెంపరేచర్ గేజ్
      • ప్రస్తుతం ఉన్న ఇంధనం మరియు ఉన్న ఇంధనంతో ఎంత దూరం ప్రయాణించవచ్చు.
      • ఆయిల్ చేంజ్ ఇండికేటర్స్ వంటి ఎన్నో సదుపాయాలు కలవు.
      • గడియారం
      • ధర

        ధర

        యమహా వైజడ్ఎఫ్-ఆర్3 స్పోర్ట్స్ బైకు ధర రూ. 3,25,000 లు ఎక్స్-షో రూమ్ ఢిల్లీగా ఉంది.

        వైజడ్ఎఫ్-ఆర్3 ఓనర్లకు విందు

        వైజడ్ఎఫ్-ఆర్3 ఓనర్లకు విందు

        ఈ అవార్డుకు వైజడ్‍ఎఫ్-ఆర్3 ఎంపిక అయిన సంధర్బంగా యమహా వారు వైజడ్‌ఎఫ్-ఆర్3 లను కొనుగోలు చేసిన 30 మందిని యాధృచ్చికంగా ఎంపిక చేశారు. వారందరికి కూడా విందును ఏర్పాటు చేశారు.

        జార్జ్ లోరెంజో

        జార్జ్ లోరెంజో

        అంతే కాకుండా వారికి బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యుట్ వద్ద రైడింగ్ ను ఏర్పాటు చేశారు. 2015 మోటో జిపి ఛాంపియన్ జార్జ్ లోరెంజో వీరితో పాటు బరిలోకి దిగనున్నారు.

        టూవీలర్ల ఉత్తమ కథనాలు

More from DriveSpark

Article Published On: Monday, December 21, 2015, 10:46 [IST]
English summary
Yamaha YZF-R3 Wins Indian Motorcycle Of The Year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+