టీవీఎస్ నుండి మళ్లీ వస్తున్న విక్టర్ మోటార్ సైకిల్
దేశీయ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ వారు ఒకానొక కాలంలో తమ విక్టర్ ద్విచక్ర వాహనాల అమ్మకాలను మార్కెట్లో నుండి విరమించుకున్నారు. అయితే ఈ ఏడాది జనవరి 20 దీనిని తిరిగి మార్కెట్లోకి ప్రవేస పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
రీ ఎంట్రీ ఇచ్చుకుంటున్న ఈ టీవీఎస్ విక్టర్ టూ వీలర్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందా రండి.

టీవీఎస్ టూ వీలర్స్ వారు ఈ విక్టర్ బైక్‌ను స్పోర్ట్ వేరియంట్లో 110 సీసీ ఇంజన్ తో ఈ 2016 సంవత్సరానికి మార్కెట్లోకి విడుదల చేయనుంది.

ప్రత్యేక బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేస్తున్న ఈ సరికొత్త స్పోర్ట్ బైకు 110సీసీ సెగ్మెంట్లో మంచి అమ్మకాలు సాధిస్తుందని కంపెనీ వర్గాలు అభిప్రాయపడ్డారు.

110సీసీ సెగ్మెంట్లో ప్రస్తుతం టీవీఎస్ వారు వినియోగదారులకు మూడు ప్రత్యేక మోడళ్లను అందిస్తున్నారు
- మ్యాక్స్ 4ఆర్
- స్టార్ సిటి 110 మరియు
- జైవ్
- బజాజ్ ఆటో
- హీరో మోటో కార్ప్
- హోండా

టీవీఎస్ వారి ఈ 110సీసీ విక్టర్ బైకును చెన్నైలోని టీవీఎస్ ప్లాంటు వారు ఉత్పత్తి చేయనున్నారు. వీటిని విడుదల చేసిన అతి త్వరలో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.

కొత్త మార్పులతో మార్కెట్లోకి విడుదల కానున్న ఈ విక్టర్ బైకు కొన్ని ఇతర తయారీ సంస్థల బైకులకు పోటీగా నిలవనుంది. అందులో ఈ సంస్థలు ఉన్నాయి.

అంతే కాకుండా టీవీఎస్ టూ వీలర్స్ వారు ఈ విక్టర్‌తో పాటు మరిన్ని మోడల్స్‌ను కూడా దేశీయంగా మరియు అంతర్జాతీయంగా వీటిని విడుదల చేయనున్నారు. వీటన్నింటిని కూడా జనవరి 20, 2016 విడుదల చేయనున్నారు.



Click it and Unblock the Notifications








