విపణిలోకి 2018 యమహా ఎమ్‌టి-09 విడుదల: ధర మరియు ఇంజన్ వివరాలు

Written By:

జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం యమహా ఇండియా విభాగం విపణిలోకి కొత్త తరం MT-09 నేక్డ్ రోడ్‌స్టర్ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. సరికొత్త 2018 యమహా ఎమ్‌టి-09 బైకు ప్రారంభ ధర రూ. 10.88 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

యమహా ఎమ్‌టి-09

నూతన్ కలర్ స్కీమ్స్‌లో ఎమ్‌టి-09 బైకులో కేవలం కాస్మొటిక్ మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయి. ఓవరాల్ డిజైన్ మరియు సాంకేతికంగా ఎలాంటి మార్పులు సంభవించలేదు. 2018 వెర్షనన్ యమహా ఎమ్‌టి-09 గురించి పూర్తి వివరాలు...

యమహా ఎమ్‌టి-09

2018 యమహా ఎమ్‌టి-09 నేక్డ్ రోడ్‌స్టర్ మోటార్ సైకిల్ మూడు విభిన్న రంగుల్లో లభ్యం కానుంది. అవి, బ్లూయిష్ గ్రే సాలిడ్, డీప్ పర్పిలిష్ బ్లూ మరియు మ్యాట్ గ్రే డార్క్. ఈ బైకు దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ఎంచుకోదగ్గ షోరూమ్‌లలో మాత్రమే లభిస్తుంది.

యమహా ఎమ్‌టి-09

కొత్త తరం యమహా ఎమ్‌టి-09 డిజైన్ పరంగా అవుట్ గోయింగ్ మోడల్‌నే పోలి ఉంటుంది. అగ్రెసివ్ ఫ్రంట్ డిజైన్, డ్యూయల్ హెడ్ ల్యాంప్ సెటప్, కండలు తిరిగిన ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఇందులో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తాయి. ప్రస్తుతం దీనిని దిగుమతి చేసుకుని విక్రయించనుంది.

యమహా ఎమ్‌టి-09

2018 యమహా ఎమ్‌టి-09 మోటార్ సైకిల్‌లో 847సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ 113.4బిహెచ్‌పి పవర్ మరియు 87.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

యమహా ఎమ్‌టి-09

500-600సీసీ కెపాసిటి గల మోటార్ సైకిళ్లను వాడుతున్న యువ కొనుగోలుదారుల్లో ఎవరైతే 800సీసీ నేక్డ్ మోటార్ సైకిల్ ఎంచుకునేందుకు చూస్తున్నారో అలాంటి వారిని టార్గెట్ చేస్తూ యమహా ఎమ్‌టి-09 బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది.

యమహా ఎమ్‌టి-09

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

విపణిలో ఎప్పటికప్పుడు ర్రీఫ్రెష్డ్ మోడల్‌గా అందుబాటులో ఉంచేందుకు యమహా ఎమ్‌టి-09 బైకులో కలర్ ఆప్‌డేట్స్ నిర్వహించి రీలాంచ్ చేసింది. ధర, అత్యుత్తమ పవర్ మరియు అధునాతన ఫీచర్లు గల ఎమ్‌టి-09 బైకు 800సీసీ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో మేటిగా నిలిచింది.

దేశీయంగా ఉన్న ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ మరియు కవాసకి జడ్900 బైకులకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: 2018 Yamaha MT-09 Launched In India; Priced At Rs 10.88 Lakh
Story first published: Saturday, November 25, 2017, 9:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark