లక్ష రుపాయల ధరలోపు లభించే ఐదు బెస్ట్ బైకులు

Written By:

కార్లు మరియు బైకుల పరిశ్రమలో భారత్‌ భారీ వృద్దిని సాధిస్తోంది. 3 లక్షల నుండి 3 కోట్ల రుపాయలకు పైబడి ఖరీదైన కార్లు ఉన్నట్లే, 30 వేల నుండి 30 లక్షలు కన్నా ఖరీదైన బైకులు మార్కెట్లో ఉన్నాయి.

ప్రత్యేకించి ఒక లక్ష లోపు ధర ఉన్న టూ వీలర్లకు విపణిలో డిమాండ్ అధికంగా ఉంది. చాలా మంది పాఠకులు లక్ష రుపాయల ధరలోపు ఉన్న బైకుల గురించి కోరడంతో డ్రైవ్‌స్పార్క్ తెలుగు పాఠకుల కోసం లక్ష రుపాయల లోపు ధరలో ఉన్న ఐదు బెస్ట్ టూ వీలర్లను ప్రత్యేక కథనం ద్వారా అందిస్తోంది.

లక్ష రుపాయల ధరలోపు లభించే టాప్-5 బైకులు

5. యమహా ఎఫ్‌జడ్-ఎల్ ఎఫ్ఐ

యమహా సరిగ్గా 2008లో ఎఫ్‌జడ్16 బైకును విపణిలోకి లాంచ్ చేసింది. 150సీసీ సెగ్మెంట్లో అప్పటి వరకు ఏ కంపెనీ కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. ఒకరకంగా చెప్పాలంటే 150సీసీ సెగ్మెంట్లో విజయం ఖచ్చితం అని నిరూపించిన మోడల్ యమహా ఎఫ్‌జడ్. దీని విజయానంతరం యమహా ఎఫ్‌జడ్-ఎస్ వెర్షన్ 2.0 ఎఫ్ఐ బైకును లాంచ్ చేసి తిరుగులేని సక్సెస్ అందుకుంది.

Recommended Video - Watch Now!
[Telugu] 2017 Triumph Tiger Explorer XCx Launched In India - DriveSpark
లక్ష రుపాయల ధరలోపు లభించే టాప్-5 బైకులు

150సీసీ ఇంజన్‌తో లక్ష రుపాయల లోపు ధరతో బెస్ట్ బైకు ఎంచుకోవాలనుకునే వారికి యమహా ఎఫ్‌జడ్-ఎస్ వెర్షన్ 2.0 ఎఫ్ఐ అత్యుత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. సాంకేతికంగా ఇందులో ఉన్న 149సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 13.2బిహెచ్‌పి పవర్ మరియు 12.8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

  • యమహా ఎఫ్‌జడ్-ఎస్ వెర్షన్ 2.0 ఎఫ్ఐ ప్రారంభ ధర రూ. 83,042 లు
లక్ష రుపాయల ధరలోపు లభించే టాప్-5 బైకులు

4. బజాజ్ అవెంజర్ 220

ఇండియన్ క్రూయిజర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో పోటీ లేకుండా రాణిస్తున్న మోడల్ బజాజ్ అవెంజర్. తొలుత 2005లో పరిచయం చేసిన బజాజ్ గత 12 సంవత్సరాల్లో వివిధ వెర్షన్‌లలో లాంచ్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం 150సీసీ మరియు 220సీసీ ఇంజన్ కెపాసిటితో అవెంజర్ బైకులో మార్కెట్లో ఉన్నాయి.

లక్ష రుపాయల ధరలోపు లభించే టాప్-5 బైకులు

పల్సర్ శ్రేణిలో ఉన్న 150 మరియు 220 మోడళ్లలో కూడా ఇవే ఇంజన్‌లు ఉన్నప్పటికీ, వాటితో పోల్చుకుంటే తక్కువ పవర్ మరియు టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. అయినా కూడా అవెంజర్ క్రూయిజర్ మోటార్ సైకిళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.

  • బజాజ్ అవెంజర్ 150 ధర రూ.80,691 లు
  • బజాజ్ అవెంజర్ 220 ధర రూ.88,922 లు
లక్ష రుపాయల ధరలోపు లభించే టాప్-5 బైకులు

3. టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి

బజాజ్‌ లైనప్‌లో పల్సర్ పేరుగాంచినట్లు టీవీఎస్‌కు అపాచే అనే బ్రాండ్ పేరు మంచి ఖ్యాతిని గడించి పెట్టింది. చెన్నై మరియు కోయంబత్తూరు రేస్ ట్రాక్ ఆధారంగా నిర్మించిన అపాచే అర్‌టిఆర్ 200 4వి మోటార్ సైకిల్లో నెక్ట్స్ లెవల్ ఫీచర్లు మరియు పవర్ ఫుల్ ఇంజన్‌ అందించింది.

లక్ష రుపాయల ధరలోపు లభించే టాప్-5 బైకులు

సాంకేతికంగా ఇందులో ఉన్న 197.75సీసీ కెపాసిటి గల ఎయిర్/ఆయిల్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టడ్ ఇంజన్ కలదు. ఇందులో కెవైబి మోనోషాక్ అబ్జార్వర్, పిరెల్లీ టైర్లు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్టడ్ మరియు కార్బోరేటెడ్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు.

  • టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ధర రూ.95,315 లు
లక్ష రుపాయల ధరలోపు లభించే టాప్-5 బైకులు

4. బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్

లక్ష రుపాయల లోపు ధరతో లభించే టాప్ 5 బెస్ట్ బైకుల జాబితాలో బజాజ్ నుండి స్థానం సంపాదించుకున్న రెండవ మోడల్ ఎన్ఎస్200. ప్రస్తుతం 200సీసీ కెపాసిటి అత్యుత్తమ విక్రయాలు సాధిసున్న మోడల్ కూడా ఇదే. కెటిఎమ్ డ్యూక్200 ప్రేరణతో దీనిని నిర్మించినప్పటికీ ఇంజన్‌ పరంగా రెండింటో పర్ఫామెన్స్ తేడా కనబడుతుంది. అత్యుత్తమ రైడ్ హ్యాండ్లింగ్ మరియు పర్ఫామెన్స్ దీని సొంతం.

లక్ష రుపాయల ధరలోపు లభించే టాప్-5 బైకులు

ఇందులో అధునాతన 199సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ ట్రిపుల్ స్పార్క్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. బిఎస్-4 అప్‌గ్రేడ్ ఇంజన్ గరిష్టంగా 23.5బిహెచ్‌పి పవర్ మరియు 18.3ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. షార్ట్ టైమ్‌లో ఎక్కువ యాక్సిలరేషన్, కొండలు, వాలు, హైవే అన్ని రకాల రోడ్ల మీద అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తుంది. ఇంకా చెప్పాలంటే 200సీసీ సెగ్మెంట్లో దీనికన్నా మెరుగైన పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేయడం మరే ఇతర మోడల్‌కైనా అసాధ్యమనే చెప్పాలి.

  • బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ధర రూ.97,075 లు
లక్ష రుపాయల ధరలోపు లభించే టాప్-5 బైకులు

5. సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్

ఎంతో మంది పాఠకులు 1 లక్ష ధరల శ్రేణిలో జిక్సర్ బెస్ట్ మోడల్‌గా నిలిచింది. సుజుకి మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ 2014లో జిక్సర్ ఎస్ఎఫ్ బైకును లాంచ్ చేసింది. అప్పట్లో యమహా ఎఫ్‌జడ్‌ రీప్లేస్ చేస్తుందనే అనుమానాలు వచ్చాయి. తేలికపాటి బరువు, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, అత్యుత్తమ రైడింగ్ మరియు సౌకర్యవంతమైన సీటంగ్ పొజిషన్ ఇందులో ప్రత్యేకంగా నిలిచాయి.

లక్ష రుపాయల ధరలోపు లభించే టాప్-5 బైకులు

సాంకేతికంగా సుజుకి జిక్సర్‌లో 160సీసీ కెపాసిటి గల ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. 8,000ఆర్‌పిఎమ్ వద్ద 14.8బిహెచ్‌పి పవర్ మరియు 6,000ఆర్‌పిఎమ్ వద్ద 14ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

  • సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ధర రూ.87,737లు.

అన్ని మోడళ్ల ధరలు వాటి ప్రారంభ వేరియంట్ల వేరియంట్ల ఎక్స్-షోరూమ్ హైదరాబాద్‌గా ఇవ్వబడ్డాయి.

English summary
Read In Telugu: top 5 bikes under rs 1 lakh in india
Story first published: Thursday, November 23, 2017, 17:08 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark