ABS ఫీచర్‌తో సుజుకి జిక్సర్ బైకుల విడుదల
సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా విపణిలోకి ఏబిఎస్ ఫీచర్ ఉన్న జిక్సర్ బైకులను విడుదల చేసింది.
సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా విపణిలోకి ఏబిఎస్ ఫీచర్ ఉన్న జిక్సర్ బైకులను విడుదల చేసింది. జిక్సర్ ఎస్ఎఫ్ కార్బోరేటర్(స్టాండర్డ్) మరియు ఫ్యూయల్ ఇంజెక్టడ్ వేరింయట్లలో భద్రత పరంగా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

ధరలు
- సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ (కార్బోరేటర్) ఏబిఎస్ ధర రూ. 95,599 లు
- సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ (ఎఫ్ఐ) ధర రూ. 99,312 లు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
- యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? మరియు దాని ఉపయోగాలు...?
Recommended Video


సుజుకి ప్రవేశపెట్టిన జిక్సర్ ఏబిఎస్ మోడళ్లలో ముందు చక్రాలకు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. అయితే వీటిలో ఉన్న వెనుక చక్రాలకు ఏబిఎస్ అందివ్వలేదు. అత్యవసర సమయాల్లో రైడర్ బ్రేకులు వేసినపుడు తక్కువ దూరంలో బైక్ ఆగడం మరియు వీల్ లాక్ అవడాన్ని ఏబిఎఎస్ నివారిస్తుంది.

ఏబిఎస్‌తో లభించే సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ మోటార్ సైకిళ్ల బాడీ పెయింట్, కలర్ స్కీమ్, డీకాల్స్ వంటివి అన్నీ రెగ్యులర్ వెర్షన్ జిక్సర్‌ను పోలి ఉంటాయి. అయితే ఏబిఎస్ వెర్షన్‌లో ముందు వైపున ఉన్న మడ్ గార్డ్ మీద ABS అని ప్రింట్ చేయబడి ఉంటుంది.

సాంకేతికంగా సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ మోటార్ సైకిళ్లలో 155సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 14.5బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఎగ్జాస్ట్ పైపులు ఉన్న ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ మోటార్ సైకిల్‌లో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, 41ఎమ్ఎమ్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్, విశాలంమైన రేడియల్ టైర్లు ఉన్నాయి. జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ రెండు కలర్ ఆప్షన్‌లలో లభించును అవి, మెటాలిక్ ట్రిటన్ బ్లూ కలర్ మరియు గ్లాస్ స్పార్కిల్ బ్లాక్/ మెటాలిక్ బ్లాక్.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
160సీసీ సెగ్మెంట్లో ఏబిఎస్ ఫీచర్‌ను పరిచయం చేసిన తొలి కంపెనీ సుజుకి టూ వీలర్స్. 2018 ఏప్రిల్ నుండి 150సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న టూ వీలర్లలో ఏబిఎస్ కల్పించడాన్ని భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో అన్ని టూ వీలర్ల సంస్థలు తమ ఉత్పత్తులో ఏబిఎస్ అందివ్వడం మీద దృష్టిసారిస్తున్నాయి. ఈ విషయంలో సుజుకి ముందడగు వేసిందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








