2018 ఎడిషన్ బజాజ్ పల్సర్ 150 ధరలు లీక్
బజాజ్ ఆటో విపణిలోకి 2018 ఎడిషన్ పల్సర్ బైకు విడుదల చేయాలని చేయడానికి సిద్దమైనట్లు ఇదివరకటి కథనంలో వెల్లడించాము. అయితే, పూర్తి స్థాయిలో విడుదలకు సిద్దమైన 2018 ఎడిషన్ బజాజ్ పల్సర్ ధరలు రహస్యంగా లీక్ అయ్
బజాజ్ ఆటో విపణిలోకి 2018 ఎడిషన్ పల్సర్ బైకు విడుదల చేయాలని చేయడానికి సిద్దమైనట్లు ఇదివరకటి కథనంలో వెల్లడించాము. అయితే, పూర్తి స్థాయిలో విడుదలకు సిద్దమైన 2018 ఎడిషన్ బజాజ్ పల్సర్ ధరలు రహస్యంగా లీక్ అయ్యాయి. కొత్త తరం బజాజ్ పల్సర్ 150 చూడటానికి అచ్చం మునుపటి తరం పల్సర్ 150 బైకునే పోలి ఉంటుంది. అయితే, ఇందులో ఎన్నో కొత్త ఫీచర్లు వచ్చాయి.

బెంగళూరు మరియు సౌత్ ఇండియాలోని పలు ప్రధాన నగరాల్లో ఉన్న బజాజ్ డీలర్లు 2018 బజాజ్ పల్సర్ 150 ధరలు, విడుదల మరియు ఫీచర్ల గురించి డ్రైవ్‌స్పార్క్ బృందానికి వెల్లడించారు. 2018 ఎడిషన్ బజాజ్ పల్సర్ 150 ధర రూ. 92,900 లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

అంతే కాకుండా, 2018 బజాజ్ పల్సర్ 150 బైకును అధికారికంగా విపణిలోకి చేయడానికి ముందే, డీలర్లు దీని మీద ముందస్తు బుకింగ్స్ ప్రారంభించారు. కొత్త తరం పల్సర్ 150 మీద బుకింగ్ మొత్తం చెల్లించిన కస్టమర్లకు స్టాక్ వచ్చిన వెంటనే డెలివరీ ప్రారంభిస్తామని డీలర్లు వెల్లడించారు.

2018 పల్సర్ 150 బైకులో వచ్చిన ప్రధాన హైలైట్ రియర్ డిస్క్ బ్రేక్ రావడం. అవును, 2018 పల్సర్ 150 బైకులో ఇప్పుడు 230ఎమ్ఎమ్ రియర్ డిస్క్ బ్రేక్ వచ్చింది. మరియు పల్సర్ 180 నుండి సేకరించిన 260ఎమ్ఎమ్ పరిమాణంలో గల పెద్ద డిస్క్ బ్రేక్ ముందు వైపున వచ్చింది.

ఇతర మార్పుల్లో, 37ఎమ్ఎమ్ ఫ్రంట్ ఫోర్క్స్, రెండు విభజించిన సీటు మరియు రియర్ హ్యాండిల్, సరికొత్త పుట్ పెడల్స్ అసెంబ్లీ మరియు ప్రీమియమ్ పెడల్స్ ఉన్నాయి. ఇవి మినహాయిస్తే, డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

2018 ఎడిషన్ బజాజ్ పల్సర్ 150 బైకులో ముందు మరియు వెనుక వైపున డిస్క్ బ్రేకులు రావడంతో బ్రేకింగ్ పనితీరు మరింత మెరుగయ్యిందని చెప్పవచ్చు. సాంకేతికంగా, ప్రస్తుతం బజాజ్ పల్సర్ 150 బైకులో ఉన్న అదే 149సీసీ కెపాసిటి గల ట్విన్-స్పార్క్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 14బిహెచ్‌పి పవర్ మరియు 13.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. ఇంజన్‌ను కొద్దిగా ట్యూన్ చేయడంతో కొత్త తరం బజాజ్ పల్సర్ 150లో పర్ మరియు టార్క్ లెవల్స్ స్వల్పంగా పెరిగాయి.
Recommended Video


అంతే కాకుండా, బజాజ్ న్యూ సిరీస్ పల్సర్ బైకులను అభివృద్ది చేస్తోంది. కొత్తగా అభివృద్ది చేసిన ఇంజన్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అత్యంత కఠినమైన ఉద్గార ప్రమాణాలను పాటించే ఇంజన్‌లను అభివృద్ది చేయనుంది. సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి కొత్త ఫీచర్లను నూతన పల్సర్ సిరీస్ బైకుల్లో అందివ్వనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
2018 బజాజ్ పల్సర్ భారీ అప్‌డేట్స్‌తో విడుదలకు సిద్దమైంది. ఫ్రంట్ మరియు రియర్ డిస్క్ బ్రేక్, స్పోర్టివ్ స్ల్పిట్ సీటు మరియు గ్రాబ్ రెయిల్స్ వంటివి ప్రతి పల్సర్ అభిమానిని ఆకట్టుకోనుంది. కానీ, ఇందులో ఏబిఎస్ ఫీచర్ మాత్రం రాలేదు.

ప్రభుత్వ నియమం ప్రకారం, 125సీసీ కంటే ఎక్కువ ఇంజన్ కెపాసిటీతో ఏప్రిల్ 1, 2018 నుండి విడుదలయ్యే ప్రతి మోటార్‌సైకిల్‌లో కూడా సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ తప్పనిసరి. కాబట్టి, ఈ గడువు ముగిసేలోపే బజాజ్ తమ అప్‌డేటెజ్ పల్సర్ 150 బైకును లాంచ్ చేసే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications








