కొత్త తరం పల్సర్ బైకులను అభివృద్ది చేస్తున్న బజాజ్

Written By:

భారత ద్విచక్ర వాహన పరిశ్రమలో బజాజ్ పల్సర్ అతి పెద్ద విజయం సాధించిన మోటార్ సైకిల్ బ్రాండ్. పల్సర్ శ్రేణి బైకులు ఇండియన్ పర్ఫామెన్స్ బైకుల సెగ్మెంట్లో ఒక కొత్త అలజడని సృష్టించాయి.

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకార, బజాజ్ ఆటో కొత్త తరం పల్సర్ శ్రేణిని అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది. కొత్త ఇంజన్, కొత్త డిజైన్ మరియు అత్యాధునిక ఫీచర్లతో ఈ నూతన శ్రేణి పల్సర్ బైకులు రానున్నాయి.

బజాజ్ పల్సర్ 150

బజాజ్ ఆటో ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో, పల్సర్ 150, పల్సర్ 180, పల్సర్ 200 మరియు పల్సర్ కొత్త సిరీస్ బైకులైన పల్సర్ ఎన్ఎస్200, ఎన్ఎస్160 మరియు ఆర్ఎస్200 బైకులను విక్రయిస్తోంది.

బజాజ్ పల్సర్ 150

రహస్యంగా పరీక్షిస్తూ ఇటీవల పట్టుబడిన పల్సర్ 150 యుజి5 బైకును కూడా విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ బైకుల సెగ్మెంట్లో ఇతర మోడళ్లకు గట్టి పోటీనివ్వడానికి అప్‌డేటెడ్ వెర్షన్ పల్సర్ 150 ఎంతగానో ఉపయోగపడనుంది.

బజాజ్ పల్సర్ 150

కొత్త తరం బజాజ్ పల్సర్ సిరీస్ బైకుల్లో అత్యంత కఠినమైన ఉద్గార ప్రమాణాలను పాటించే అధునాతన ఇంజన్‌లను అందివ్వనుంది. ఈ ఇంజన్‌ రేంజ్ 150సీసీ నుండి 250సీసీ మధ్య ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పల్సర్ 220 మోడల్ భవిష్యత్తులో పల్సర్ 250 మోడల్‌గా విడుదలయ్యే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ 150

కఠినమైన మరియు భవిష్యత్ ఉద్గార నియమాలను పాటించే నూతన శ్రేణి ఇంజన్‌లలో ఫ్యూయల్ ఇంజెక్షన్ మరియు 4-వాల్వ్ టెక్నాలజీ రానుంది. అత్యుత్తమ పవర్ మరియు టార్క్ ఉత్పత్తయ్యేలా కొత్త ఇంజన్‌లను రూపొందిస్తుండటంతో పర్ఫామెన్స్ బైకు ప్రియులకు మంచి పవర్ ఇవ్వడం ఖాయం.

బజాజ్ పల్సర్ 150

కొత్త తరం పల్సర్ శ్రేణి బైకులను ఆత్యాధునికంగా మరియు స్పోర్టివ్‌ శైలిలో తీర్చిదిద్దేంకు నూతన డిజైన్ ఫిలాసఫీతో అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది. రీడిజైన్ చేయబడిన ఫ్రేమ్ మీద మోనో షాక్ అబ్జార్వర్లు మరియు ట్విన్ షాక్ అబ్జార్వర్లతో నిర్మిస్తోంది.

బజాజ్ పల్సర్ 150

పల్సర్ శ్రేణి ఫ్యామిలీలో అన్ని బైకులు సింగల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో లభించనున్నాయి. ప్రస్తుతం పల్సర్ ఆర్ఎస్200 మరియు ఎన్ఎస్200 బైకుల్లో మాత్రమే ఏబిఎస్ లభిస్తోంది. అంతే కాకుండా, ఎన్ఎస్160 స్థానంలో ఎన్ఎస్180 మరియు సరికొత్త 250సీసీ మోటార్ సైకిల్‌ను పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బజాజ్ పల్సర్ 150

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో సంస్థకు పల్సర్ శ్రేణి బైకులు విపరీతమైన సేల్స్ సాధించిపెడుతున్నాయి. మార్కెట్లో కూడా గత దశాబ్ద కాలం నుండి అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా కస్టమర్లు ఆదరణ చూరగొంది. పల్సర్ శ్రేణి బైకులకు పోటీ అధికమైనప్పటికీ, పల్సర్ బైకులకు ఫ్యాన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.

ప్రస్తుతానికి బజాజ్ నూతన శ్రేణి పల్సర్ బైకులు ఇంకా అభివృద్ది దశలోనే ఉన్నాయి. ఇవి 2019 నాటికి పూర్తి స్థాయిలో విక్రయాలకు సిద్దం కానున్నాయి.

Source: Autocar India

Read more on: #bajaj #బజాజ్
English summary
Read In Telugu: Next-Gen Bajaj Pulsar In The Works — Specifications, Key Features & More Details
Story first published: Saturday, March 24, 2018, 22:23 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark