2018 హీరో సూపర్ స్ల్పెండర్ విడుదల: ధర రూ. 57,190

Written By:

దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ విపణిలోకి సరికొత్త 2018 హీరో సూపర్ స్ల్పెండర్ బైకును లాంచ్ చేసింది. 2018 హీరో సూపర్ స్ల్పెండర్ కమ్యూటర్ మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ. 57,190 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

Recommended Video - Watch Now!
హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ బైక్ రివీల్ | Honda X-Blade - Details & Full Specifications - DriveSpark
2018 హీరో సూపర్ స్ల్పెండర్

హీరో అప్‌డేట్ చేసిన సూపర్ స్ల్పెండర్ 125 కమ్యూటర్ బైకులో 124.7సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 2017లో విడుదలైన హీరో గ్లామర్ బైకులో కూడా ఇదే ఇంజన్ ఉంది.

2018 హీరో సూపర్ స్ల్పెండర్

దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో హీరో మోటోకార్ప్ 50 శాతా వాటాను కలిగి ఉంది. తాజాగా విడుదల చేసిన ఈ 2018 వెర్షన్ సూపర్ స్ల్పెండర్ బైకును యంగ్ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుసుకుని హీరో ప్రవేశపెట్టింది.

2018 హీరో సూపర్ స్ల్పెండర్

2018 హీరో సూపర్ స్ల్పెండర్‌లో సాంకేతికంగా, 124.7సీసీ కెపాసిటి గల ఇంజన్ 7,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 11.2బిహెచ్‌పి పవర్ మరియు 6,000ఆర్‌పిఎమ్ వద్ద 11ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 హీరో సూపర్ స్ల్పెండర్

2018 హీరో సూపర్ స్ల్పెండర్ బైక్ పవర్ అవుట్‌పుట్స్ పెరిగాయి. పవర్ 1.87బిహెచ్‌పి మరియు టార్క్ .65ఎన్ఎమ్ టార్క్ అధికంగా ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా, ఈ బైకులో హీరో పేటెంట్ పొందిన ఇంజన్ ఐడిల్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్(I3S) ఉంది.

2018 హీరో సూపర్ స్ల్పెండర్

హీరో గ్లామర్ తరహాలోనే 2018 హీరో సూపర్ స్ల్పెండర్ బైకులో 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. దీని మొత్తం బరువు 124కిలోలుగా ఉంది. మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే దీని బరువు 3 కిలోల వరకు పెరిగింది.

2018 హీరో సూపర్ స్ల్పెండర్

2018 హీరో సూపర్ స్ల్పెండర్‌లో వచ్చిన కొత్త ఇంజన్ మినహాయిస్తే, స్పోర్టివ్ శైలిలో ఉన్న సరికొత్త సీటు వచ్చింది. మునుపటి సూపర్ స్ల్పెండర్‍‌తో పోల్చుకుంటే విశాలంగా మరియు అత్యంత సౌకర్యవంతంగా ఉంది.

2018 హీరో సూపర్ స్ల్పెండర్

సూపర్ స్ల్పెండర్ సైడ్ ప్యానళ్లను కూడా రీడిజైన్ చేశారు. మునుపటి బైకులోని టెయిల్ సెక్షన్‌లో ఉన్న హెక్సాగోనల్ టెయిల్ ల్యాంప్ స్థానంలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఇడి టెయిల్ లైట్ సెటప్ ఉంది. ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, విశాలమైన రియర్ టైర్ మరియు లాకింగ్ ఫెసిలిటి గల సైడ్ యుటిలిటి బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary
Read In Telugu: 2018 Hero Super Splendor Launched In India; Priced At Rs 57,190
Story first published: Thursday, March 8, 2018, 9:46 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark