న్యూ యమహా ఆర్15 వి3 మీద బుకింగ్స్ స్టార్ట్

Written By:
Recommended Video - Watch Now!
Ducati 959 Panigale Crashes Into Buffalo - DriveSpark

యమహా నుండి విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మోడల్ సరికొత్త వైజడ్ఎఫ్ ఆర్15 వి3 బైకు(Yamaha YZF R15 V3) మీద యమహా బుకింగ్స్ ప్రారంభించింది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, యమహా ఈ సరికొత్త ఆర్15 వి3 బైకు మీద దేశవ్యాప్తంగా బుకింగ్స్ స్టార్ట్ చేసి, వచ్చే ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలిసింది.

యమహా ఆర్15 వి3 బుకింగ్స్

కొత్త తరం యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3 బైకు రూ. 5,000 ల ధరతో దేశవ్యాప్తంగా ఉన్నయమహా అధీకృత డీలర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు. వచ్చే నెలలో విడుదలైన తరువాత డెలివరీలను వేగవంతం చేయనుంది.

యమహా ఆర్15 వి3 బుకింగ్స్

అంతర్జాతీయ మోడల్‌తో పోల్చుకుంటే ఇందులో ఆశించిన మేర అప్‌గ్రేడ్స్ చోటు చేసుకోవడం లేదు. యమహా ఈ న్యూ జనరేషన్ ఆర్15 వి3 బైకును ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించింది.

యమహా ఆర్15 వి3 బుకింగ్స్

సరికొత్త యమహా ఆర్15 వి3 మోటార్ సైకిల్‌లో అప్ సైడ్ డౌన్ ఫోర్క్స్ బదులు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ఐఆర్‌సి టైర్ల స్థానంలో ఎమ్ఆర్ఎఫ్ టైర్లు వస్తున్నాయి. అయితే, సేఫ్టీలో కీలకమైన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో మిస్సయ్యింది.

యమహా ఆర్15 వి3 బుకింగ్స్

అంతే కాకుండా ఆర్15 వి3 బైకులో వి2 తరహా ఫ్రంట్ డిజైన్, ఫుట్‌పెగ్స్ వస్తున్నాయి. అయితే, స్లిప్పర్ క్లచ్ దాదాపు రాకపోవచ్చు.

యమహా ఆర్15 వి3 బుకింగ్స్

ఇంజన్ విషయానికి వస్తే, సరికొత్త యమహా ఆర్15 వి3 లో అదే 155.1సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ రానుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 19బిహెచ్‌పి పవర్ మరియు 14.7ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యమహా ఆర్15 వి3 బుకింగ్స్

యమహా ఆర్15 వి3లో 11 లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్, ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. దీని బరువు మొత్తం 137కిలోలుగా ఉండనుంది. శాడిల్ మరియు సీటు ఎత్తును పెంచడంతో సౌకర్యవంతమైన రైడింగ్ మరియు అత్యుత్తమ హ్యాండ్లింగ్ సాధ్యమవుతుంది.

యమహా ఆర్15 వి3 బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యామహా ఇండియా సరికొత్త ఆర్15 వి3 మోటార్ సైకిల్‌ను అత్యంత పోటీతత్వమున్న మరియు సరసమైన ధరలో విడుదల చేయాలని చూస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో ఉన్న ఈ బైకు ధర మన రుపాయల్లో 1.7 లక్షలుగా ఉంది. 150సీసీ మోటార్ సైకిల్ ధర ఈ మేరకు ఉండటం కాస్త ఎక్కువే.

యమహా ఆర్15 వి2 అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయకుండా సరికొత్త ఆర్15 వి3 బైకును స్వల్ప అప్‌గ్రేడ్స్‌తో రూ. 1.2 లక్షల నుండి రూ. 1.3 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Source: Rushlane

Read more on: #yamaha #యమహా
English summary
Read In Telugu: New Yamaha YZF R15 V3 Bookings Open In India; To Launch Soon
Story first published: Monday, January 29, 2018, 16:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark