రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్‌కు ఫుల్ స్టాప్!!

Written By:
Recommended Video - Watch Now!
Andhra Pradesh State Transport Bus Crashes Into Bike Showroom - DriveSpark

రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లు ఇప్పటికీ ఎక్కువగా నిరాశ చెందేది ఆ బైకుల్లో వచ్చే వైబ్రేషన్స్. అత్యధికంగా వైబ్రేషన్స్ వచ్చేవి బైకులు ఏవంటే వెంటనే వచ్చేవి రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు. డిజైన్ మరియు అవి ఇచ్చే సౌండ్ పరంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నప్పటకీ, వాటి నుండి వచ్చే వైబ్రేషన్స్ కారణంగా చాలా మంది ఎంచుకోవడం లేదు.

అయితే, అలాంటి వారి కోసం రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్ నివారించేందుకు కొత్త టెక్నాలజీని కనిపెట్టింది. అదేంటో ఇవాళ్టి స్టోరీలో చూద్దాం రండి...

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్‌ తగ్గించే ప్లేటు

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్ తగ్గించేందుకు ప్రఖ్యాత కస్టమ్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ కార్‌బెర్రీ మోటార్ సైకిల్స్ ప్రత్యేక వైబ్రేషన్ తగ్గించే ప్లేటును ఆవిష్కరించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్‌ తగ్గించే ప్లేటు

ఈ వైబ్రేషన్ రిడక్షన్ ప్లేటు కేవలం రాయల్ ఎన్ఫీల్డ్‌లోని 350సీసీ మరియు 500సీసీ ఇంజన్‌లకు మాత్రమే సెట్ అవుతుంది. ఇంజన్ నుండి వచ్చే కుదుపులను గణనీయంగా తగ్గించడంలో ఈ ప్లేట్ ఉపయోగపడుతుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్‌ తగ్గించే ప్లేటు

కార్‌బెర్రీ మోటార్ సైకిల్స్, ఈ మధ్య కాలంలో వి-ట్విన్ 1000సీసీ మోటార్ సైకిల్‌ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. కార్‌బెర్రీ విడుదల చేసిన ఈ వైబ్రేషన్స్ తగ్గించే ప్లేటు ధర రూ. 3,000 లుగా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్‌ తగ్గించే ప్లేటు

ఇంజన్‌లోని పిస్టన్ రాడ్ కనెక్టింగ్ రాడ్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ రాడ్‌కు ఒక వైపు క్రాంక్ షాప్ట్‌ మరో వైపున గేర్‌షాఫ్ట్‌కు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ కనెక్టింగ్ రాడ్‌కు కుడివైపున, అంటే క్రాంక్‌షాఫ్ట్ సైడ్ ఉన్న బేరింగ్ వద్ద ఈ వైబ్రేషన్ రిడక్షన్ ప్లేటును అమర్చుతారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్‌ తగ్గించే ప్లేటు

క్లచ్ సిస్టమ్ కూడా ఇంజన్‌కు కుడి వైపున ఉంటుంది. క్లచ్ క్రిందగా ఉన్న క్యామ్ వీల్‌ మరియు క్లచ్ సిస్టమ్ అమరిక వలన ఇంజన్ అధిక వేగంలో ఉన్నపుడు క్రాంక్‌షాఫ్ట్ మీద ఒత్తిడి పెరిగి, ఈ ఒత్తిడి బైకు మొత్తానికి వైబ్రేషన్స్ రావడానికి కారణమవుతుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్‌ తగ్గించే ప్లేటు

కార్‌బెర్రీ మేరకు, క్రాంక్‌షాఫ్ట్ మీద కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు, క్రాంక్‌షాఫ్ట్ క్యామ్ వీల్‌ను తిప్పడానికి అమర్చిన చిన్న గేర్లను కవర్ చేస్తూ వైబ్రేషన్స్ రిడక్షన్ ప్లేటును రూపొందించినట్లు తెలిపింది. క్రాంక్‌షాఫ్ట్ చివరిలో ఈ ప్లేటును అమర్చి, సపోర్ట్ కోసం అదనంగా మరో బేరింగ్ ఫిట్ చేస్తామని పేర్కొంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్‌ తగ్గించే ప్లేటు

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో 60 నుండి 90కిలోమీటర్ల వేగం మధ్య వచ్చే వైబ్రేషన్స్ ఇంజన్‌లోని బేరింగులు మరియు ఇతర చిన్న విడి భాగాలు అరిగిపోయి, చిన్న శబ్దానికి కారణమవుతాయి. వైబ్రేషన్స్ రిడక్షన్ ప్లేటును అమర్చడంతో కుదుపులు తగ్గడం మాత్రేమ కాకుండా వైబ్రేషన్స్ ద్వారా ఇంజన్ మీద కలిగే దుష్ప్రభావాలను కూడా తగ్గించుకోవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్‌ తగ్గించే ప్లేటు

మరి మీ వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ బైకు ఉందా, అది కూడా మీకు నచ్చని విధంగా వైబ్రేషన్స్ ఇస్తోందా..? మరెందుకు ఆలస్యం, వెంటనే కార్‌బెర్రీ వెబ్‌సైట్‌ను సంప్రదించి వైబ్రేషన్స్ రిడక్షన్ ప్లేటును మీ బైకులో కూడా ఫిట్ చేయించుకోండి.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్‌ తగ్గించే ప్లేటు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కార్‌బెర్రీ మోటార్ సైకిల్స్ కేవలం కస్టమ్ బైకులను మాత్రమే కాదు, స్వంత పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన వి-ట్విన్ 1000సీసీ ఇంజన్‌ను కూడా అభివృద్ది చేసింది. కార్‌బెర్రీ అధికంగా మోడిఫై చేస్తున్న బైకుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఎక్కువగా ఉన్నాయి. అందుకే కాబోలు ఆర్‌ఇ 350 మరియు 500సీసీ ఇంజన్‌ల కోసం ప్రత్యేకంగా వైబ్రేషన్స్ రిడక్షన్ ప్లేటును అభివృద్ది చేసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్‌ తగ్గించే ప్లేటు

ఏదేమైనప్పటికీ, ఈ ఆవిష్కరణతో నిజంగానే రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్ తగ్గిపోయాయంటే, రాయల్ ఎన్ఫీల్డ్‌కు ఇక మీదట కస్టమర్ల తాకిడి విపరీతంగా పెరగనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల కోసం వైబ్రేషన్స్ తగ్గించే ప్లేటును ఆవిష్కరించిన కార్‌బెర్రీ గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సులో తెలపండి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Royal Enfield Engine Vibration Reduction Plate Launched By Carberry Motorcycles
Story first published: Saturday, January 27, 2018, 17:35 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark