తలపాగా మ్యాచింగ్ కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

Written By:
Recommended Video - Watch Now!
Tata Nexon Faces Its First Recorded Crash

లండన్‌లో స్థిరపడిన భారత సంతతి వ్యాపార వేత్త రూబెన్ సింగ్ ప్రతి రోజు ధరించే తలపాగా రంగుకు మ్యాచ్ అయ్యే విధంగా రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశాడు. తలపాగా రంగుకు రోల్స్ రాయిస్ కారు మ్యాచింగ్ ఏంటబ్బా అని ఆశ్చర్యపోయారు కదూ...?

తలపాగా కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

మీరు చదివింది అక్షరాలా నిజమే, రూబెనె సింగ్‌ లండన్‌లో ఉన్నపుడు ఒక బ్రిటన్ వ్యక్తి చేసిన ఛాలెంజ్‌ను నిజం చేస్తూ తను రోజు ధరించే తలాపాగా రంగుకు మ్యాచ్ అయ్యేలా రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశాడంట. ఇంతకూ ఆ ఛాలెంజ్ ఏంటి, ఎంతో మందికి స్పూర్తినిచ్చే రూబెన్ సింగ్ సక్సెస్ స్టోరీ ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

తలపాగా కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ఇండియాకు చెందిన రూబెన్ సింగ్ నిరూపించాడు. ఇంగ్లాండులో స్థిరపడిన రూబెన్ సింగ్ ఒక ఆంగ్లేయుడితో చేసిన ఛాలెంజ్‌ను నెగ్గేందుకు ఏకంగా ఏడు రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశాడు.

తలపాగా కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

ఛాలెంజ్ ఏమిటి ?

ఓ ఇంగ్లాండ్ వాసి తన తలపాగాను హేళన చేస్తూ బ్యాడేంజ్ అని వెక్కిరించే వాడట, ఇందుకు విసుగు చెందిన రూబెన్ సింగ్ నా తలపాగాను హేళన చేస్తావా...? చూస్తూ ఉండు, నేను ప్రతి రోజు ధరించే తలపాగా రంగుకు మ్యాచ్ అయ్యే రోల్స్ రాయిస్ కార్లను కొని, తలపాగా పవర్ ఏంటో చూపిస్తానని చాలెంజ్ చేసాడు.

తాను ధరించే తలపాగా రంగుకు మ్యాచ్ అయ్యే రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసి తాను ఛాలెంజ్ నెగ్గినట్లు రూబెన్ సింగ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తలపాగా కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

ఎవరీ రూబెన్ సింగ్?

ఒక ఆంగ్లేయుడు జ్యాత్యాహంకారంతో తలపాగా మీద చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ వివిధ రంగుల్లో ఉన్న రోల్స్ రాయిస్ కొనుగోలు చేసిన రూబిన్ సింగ్ "బ్రిటన్ బిల్ గేట్స్‌" గా ప్రపంచానికి సుపరిచితం.

తలపాగా కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

ఆంగ్లేయుడికి రూబెన్ సింగ్ మధ్య జరిగిన పందెం ప్రకారం, ఇందులో ఎవరు ఓడిపోతే వారు స్వచ్ఛంద సంస్థగా డబ్బును విరాళంగా ఇవ్వాలని పందెం వేసుకున్నారు. అయితే, రూబెన్ సింగ్ పందెం ప్రకారం ఏడు రోజుల కోసం విభిన్న రంగుల్లో ఉన్న కార్లను కొనుగోలు చేసి గెలిచాడు.

సిక్కు మతానికి చెందిన బిలియనీర్ రోజు తన తలపాగా రంగును పోలి ఉండే రోల్స్ రాయిస్ కార్లతో వారం పాటు దిగిన ఫోటోలను ఇండియన్ బాడీ బిల్డర్ వారిందర్ గుహ్మన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌ను 1,800 మంది షేర్ చేయగా, 9,000లకు పైగా లైక్స్ వచ్చాయి.

తలపాగా కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

బిలియనీర్ రూబెన్ సింగ్ తన సొంత తెలివి టలతో భారీగా సంపాదించాడు. అయితే, 2007లో దివాళా తీయడంతో చాలా సంపద నష్టపోయాడు.

తలపాగా కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

ఇంగ్లాండులో "బ్రిటన్ బిల్‌గేట్స్" అంటే తెలియని వారుండరు. తన తండ్రి మీద ఏ మాత్రం ఆధారపడకుండా సొంత శ్రమతో వ్యాపార రంగంలో అద్భుతంగా రాణించి భారీ సంపదను సృష్టించాడు.

తలపాగా కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

రూబెన్ సింగ్ సుమారుగా 1990లో ఇంగ్లాండులో మిస్ ఆటిట్యూడ్ అనే ఫ్యాషన్ చైనా బిజినెస్ స్థాపించాడు. అప్పట్లో దీనికి మంచి పాపులారిటీ లభించింది. తన 17వ ఏట తాను స్థాపించిన "మిస్ ఆటిట్యూడ్" స్టోర్‌లో రోజుకు 20 గంటలు పనిచేసేవాడు.

తలపాగా కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

చివరికి తనకంటూ ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఎంతో ఇష్టపడి స్థాపించి, కష్టపడి ఓ స్థాయికి తీసుకొచ్చిన తన సామ్రాజ్యాన్ని కేవలం 80 రుపాయలకు అయిష్టంగా విక్రయించాడు.

తలపాగా కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

తరువాత వ్యక్తిగతంగా దివాలా తీయడంతో ఇండియాకు చెందిన బిలియనీర్ రూబెన్ సింగ్ తన రెండవ బిజినెస్ ఆల్‌డే‌పిఎ సంస్థ(AlldayPA) మీద పట్టును కోల్పోయాడు.

తలపాగా కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

2007-2017 మధ్య మళ్లీ కష్టపడంతో రూబెన్ సింగ్ మళ్లీ AlldayPA సంస్థను ఓ స్థాయికి తీసుకొచ్చి మంచి విజయాన్ని సాధించాడు. తరువాత, కాల్ ఆన్సరింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ అనే సంస్థకు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా భాద్యతలు చేపట్టాడు.

తలపాగా కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

విదేశీయులు ఇండియన్స్‌ను హేళన చేయడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో రాజస్థాన్ రాజు లండన్ పర్యటనలో ఉన్నపుడు రోల్స్ రాయిస్ షోరూమ్ నిర్వాహకులు అవమానించినందుకు ఆ కార్లను ఇండియాకు రప్పించి చెత్తను తరలించడానికి ఉపయోగించాడు.

తలపాగా కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

మరోసారి రతన్ టాటా గారు సహాయం కోసం అమెరికాలోని ఫోర్డ్ ప్రతినిధులను కలిసినపుడు కార్లు తయారు చేయడం చేతకానపుడు ప్రయత్నించకూడదని అవమానించారు. ఇప్పుడు ఫోర్డ్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీని టాటా కొనుగోలు చేసింది.

తలపాగా కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

ఛాలెంజ్ చేయడంలో ఎలాంటి తప్పులేదు. కానీ, వాటికి అనుగుణంగా కష్టపడి విజయాన్ని సాధించి మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ల మీద నెగ్గి చూపించాలి. ఇందుకు అసాధ్యం అనుకునే ఈ మూడు కథనాలను స్పూర్తిగా తీసుకొవాలి...

Picture credit: Harijinder Singh Kukreja / Twitter

English summary
Read In Telugu: Sikh Billionaire Colour Matches His Turbans With His Rolls Royce

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark