సరికొత్త కలర్ ఆప్షన్‌లో టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 విడుదల

Written By:
Recommended Video - Watch Now!
TVS NTorq 125 Review, Full Specifications, Features, Colours & More - DriveSpark

ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టీవీఎస్ మోటార్ కంపెనీ తమ స్కూటీ జెస్ట్ 110 స్కూటర్ మ్యాట్ పర్పుల్ పెయింట్ స్కీములో ఆవిష్కరించింది. ఇప్పుడు, పర్పుల్ పెయింట్ స్కీమ్‌లో స్కూటీ జెస్ట్ స్కూటర్‌ను రెగ్యులర్ స్కూటీ జెస్ట్ ధరలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది.

టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110

సరికొత్త మ్యాట్ పర్పుల్ ఫినిషింగ్‌లో స్కూటీ జెస్ట్ స్కూటర్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ. 49,211 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. ఈ కొత్త పెయింట్ స్కీములో ఉన్న స్కూటీ జెస్ట్ రెగ్యులర్ వేరియంట్ల ధరతోనే లభిస్తోంది.

టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110

టీవీఎస్ గత ఏడాది తమ స్కూటీ జెస్ట్ స్కూటర్‌ను మ్యాట్ ఫినిషింగ్ రంగుల్లో పరిచయం చేసింది. ఇప్పటికే నాలుగు విభిన్న మ్యాట్ ఫినిషింగ్ రంగుల్లో లభ్యమవుతోంది. అవి, నలుపు, ఎరుపు, పసుపు మరియు నీలం. దీనికి తోడు తాజాగా మ్యాట్ పర్పుల్ రంగు వచ్చి చేరింది.

టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110

సాంకేతికంగా టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 స్కూటర్‌లోని మ్యాట్ పర్పుల్ ఎడిషన్‌లో అదే 109.7సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. సివిటి ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 7.8బిహెచ్‌పి పవర్ మరియు 8.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110

టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్‌లో సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున హైడ్రాలిక్ మోనోషాక్ అబ్జార్వర్ ఉంది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 110ఎమ్ఎమ్ డ్రమ్ మరియు రియర్ వీల్‌కు 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంది.

టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110

స్కూటీ జెస్ట్ 110 స్కూటర్‌లో 19-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ సామర్థ్యం, యుఎస్‌బి ఛార్జర్, పగటి పూట వెలిగే లైట్ వంటివి ఉన్నాయి. మ్యాట్ సిరీస్ స్కూటర్లలో ప్రత్యేకించి అండర్ సీట్ స్టోరేజీలో లైట్, డ్యూయల్ టోన్ కలర్ సీటు, సిల్వర్ ఓక్ ఇంటీరియర్ ప్యానల్ మరియు త్రీడి జెస్ట్ 110 లోగో వంటి ఫీచర్లు ఉన్నాయి.

టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110

టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 ఎంట్రీ లెవల్ స్కూటర్ల సెగ్మెంట్లో పాపులర్ మోడల్‌గా నిలిచింది. విపణిలో ఉన్న హోండా ఆక్టిలా ఐ, సుజుకి లెట్స్, హీరో ప్లెజర్ మరియు యమహా రే-జడ్ వంటి స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది.

టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110

110సీసీ స్కూటర్లకే పరిమితమైన టీవీఎస్ ఈ మధ్య కాలంలో విపణిలోకి సరికొత్త ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. స్పోర్టివ్ డిజైన్ మరియు సౌలభ్యమైన ఫీచర్లను ఇందులో అందించింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 మార్కెట్లోకి విడుదలైన భారతదేశపు తొలి ఎల్‌సిడి డిస్ల్పే మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో వచ్చిన స్కూటర్.

English summary
Read In Telugu: TVS Scooty Zest 110 Launched In New Matte Purple Colour Scheme
Story first published: Tuesday, February 27, 2018, 10:54 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark