ఎన్‌టార్క్ 125 స్కూటర్ విడుదలతో హోండాకు గట్టి షాక్ ఇచ్చిన టీవీఎస్

టీవీఎస్ మోటార్ కంపెనీ విపణిలోకి ఎన్‌టార్క్ 125(NTorq 125) స్కూటర్‌ను విడుదల చేసింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ప్రారంభ ధర రూ. 58,750 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

By Anil

Recommended Video

Auto Rickshaw Explodes In Broad Daylight

దక్షిణ భారత దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ విపణిలోకి ఎన్‌టార్క్ 125(NTorq 125) స్కూటర్‌ను విడుదల చేసింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ప్రారంభ ధర రూ. 58,750 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

టీవీఎస్ మోటార్స్ కంపెనీ ఎన్‌టార్క్ 125 స్కూటర్ విడుదలతో ఎట్టకేలకు దేశీయ 125సీసీ స్కూటర్ల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. 2014 ఆటో ఎక్స్‌పోలో టీవీఎస్ ఆవిష్కరించిన కాన్సెప్ట్ వెర్షన్ గ్రాఫైట్ స్కూటర్‌ను ప్రొడక్షన్ వెర్షన్‌లో ఎన్‌టార్క్ పేరుతో విడుదల చేసింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

సౌకర్యం, సౌలభ్యం, సులభతరం మరియు సురక్షితం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను టీవీఎస్ కేవలం యువతను మాత్రమే ఉద్దేశించి కాకుండా, అన్ని రకాల వయసున్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని పర్ఫామెన్స్ స్కూటర్ల సెగ్మెంట్లోకి విడుదల చేసింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

స్టైల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రేరణతో అత్యంత పదునైన డిజైన్ గీతలతో, ఉలితో చెక్కబడిన ఫ్రంట్ డిజైన్, మరియు టీవీఎస్ రేసింగ్ డిజైన్ అంశాలను జోడించి ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను డిజైన్ చేశారు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

కొలతలు మరియు ప్రాథమి డిజైన్ అంశాలు అచ్చం టీవీఎస్ గ్రాఫైట్ కాన్సెప్ట్ స్కూటర్‌నే పోలి ఉంటాయి. అయితే, పగటి పూట వెలిగే అధునాతన ఎల్ఇడి లైట్లు, సరికొత్త ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ సెక్షన్, లావుగా ఉన్న ఎగ్జాస్ట్ పైపు మరియు స్కూటర్ ఇచ్చే నూతన ఎగ్జాస్ట్ సౌండ్ వంటివి ఎన్‌టార్క్ 125లో స్పోర్టివ్ ఫీల్ కలిగిస్తాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

సాంకేతికంగా టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో 125సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ సివిటిఐ ఇంజన్ కలదు. ఇది 7,500ఆర్‌పిఎమ్ వద్ద 9.27బిహెచ్‌పి పవర్ మరియు 10.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. వేగంగా స్పందించే ఎన్‌టార్క్ 125 గరిష్ట వేగం గంటకు 95కిమీలుగా ఉంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

సరికొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో ఆటో చోక్, ఇంటెలిజెంట్ ఇగ్నిషన్ సిస్టమ్, స్ల్పిట్ టైప్ ఇంటేక్ డిజైన్, ఫోన్-ఆన్-పేపర్ ఎయిర్ ఫిల్టర్ మరియు కంబషన్ ఛాంబర్ చుట్టూ విభిన్నమైన ఆయిల్ కూలింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

ప్రతి ఒక్కరూ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ఎంచుకోవడానికి దోహదం చేసే ఫీచర్లలో స్మార్ట్ కనెట్క్ టెక్నాలజీ. ఇండియన్ మార్కెట్లో ఉన్న కెటిఎమ్ డ్యూక్ 390 మినహాయిస్తే, ఇలాంటి ఫీచర్ మరెందులోనూ లేదు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లోని స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ ద్వారా బ్లూటూత్ ఉపయోగించి స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. దీంతో ఎల్‌సిడి స్క్రీన్ మీద టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్ అంటూ రియర్ టైమ్ న్యావిగేషన్ అందిస్తుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

టీవీఎస్ ఇందులో అందించిన ఎల్‌సిడి స్క్రీన్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మాత్రమే 55 విభిన్న ఫీచర్లను కలిగి ఉంది. టాప్ స్పీడ్ రికార్డర్, ల్యాప్ టైమర్, ఫోన్ బ్యాటరీ స్ట్రెంథ్ డిస్ల్పే, చివరిసారిగా పార్క్ చేసిన ప్రదేశాన్ని గుర్తుంచుకోవడం, యావరేజ్ స్పీడ్, స్పోర్ట్స్ మరియు స్ట్రీట్ రైడింగ్ మోడ్ వంటివి ఉన్నాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

అంతే కాకుండా, ఎన్‌టార్క్ 125 డిస్ల్పేలో మన ఫోన్‌కు వచ్చే కాల్స్ గురించి సమాచారం, కాల్స్ మరియు టెక్ట్స్ మెసేజ్‌లకు ఫోన్ యూజర్ రైడింగ్ చేస్తున్నాడనే విషయాన్ని ఆటోమేటిక్‌‌గా మెసేజ్ రూపంలో రిప్లే ఇస్తుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

టీవీఎస్ వారి మొదటి ప్రీమియమ్ స్కూటర్లో సీటుకు వెనకాల బాహ్యవైపున ఉన్న ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఇంజన్ కిల్ స్విచ్, పాస్ బై స్విచ్, పార్కింగ్ బ్రేక్స్, డ్యూయల్ సైడ్ హ్యాండిల్ లాక్, యుఎస్‌బి మొబైల్ ఫోన్ ఛార్జర్ మరియు 22లీటర్ల కెపాసిటి గల విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటి కలదు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

భద్రతను దృష్టిలో ఉంచుకుని 110/80-12 కొలతల్లో ఉన్న విశాలంగా, అత్యుత్తమ పట్టుత్వం కలిగి ఉండే ట్యూబ్ లెస్ టైర్లు, స్పోర్టివ్ లుక్‌లో ఉండే అల్లాయ్ వీల్స్ మరియు సెగ్మెంట్లోనే మొట్టమొదటిగా సారిగా ముందువైపున స్టాండర్డ్ పెటల్ డిస్క్ బ్రేక్ ఉంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

పూర్తిగా న్యూ ఫ్రేమ్ మీద నిర్మించడంతో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్లో అత్యుత్తమ సస్పెన్షన్ సాధ్యమైంది. గాలి ద్వారా కలిగే ఘర్షణను ఎందుర్కొనేలా నిర్మించడం అత్యుత్తమ కార్నరింగ్ మరియు హ్యాండ్లింగ్ సాధ్యమైంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ప్రీమియమ్ స్కూటర్ నాలుగు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి, మ్యాట్ ఎల్లో, మ్యాట్ గ్రీన్, మ్యాట్ రెడ్ మరియు మ్యాట్ వైట్.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ సరికొత్త ఎన్‌టార్క్ 125 స్కూటర్ విడుదలతో విపణిలోకి అత్యాధునిక ఫ్యూచర్ స్కూటర్‌ను ప్రవేశపెట్టిందని చెప్పవచ్చు. ఇండియన్ 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో ఇప్పటి వరకు మరే కంపెనీ పరిచయం చేయని ఫీచర్లను అందించింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

కేవలం రెండున్నర నెలల సమయంలో 50,000 యూనిట్ల సేల్స్ మైలురాయిని దాటిన హోండా గ్రాజియా 125 స్కూటర్‌కు టీవీఎస్ ఎన్‌టార్క్ 125 గట్టి పోటీనివ్వనుంది.

ఈ రెండు మోడళ్లకు పోటీగా ఇటాలియన్ దిగ్గజం అప్రిలియా వచ్చే 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో ద్వారా తమ సరికొత్త అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్‌ను ఆవిష్కరించనుంది. అయితే, ఎల్‌సిడి తరహా స్క్రీన్, స్మార్ట్ కనెక్ట్ మరియు అగ్రెసవ్ డిజైన్ స్టైలింగ్ బహుశా రాకపోవచ్చు. కాబట్టి స్కూటర్ల ప్రపంచంలో టీవీఎస్ ఎన్‌టార్క్ అద్భుతాలు సృష్టించడం ఖాయం అని చెప్పవచ్చు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: TVS NTorq 125 Launched At Rs 58,750 — A Scooter With Smart Connectivity For The Smart Generation
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X