ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఐకానిక్ వెస్పా బ్రాండ్‌లో కొత్త బిఎస్6 స్కూటర్లను విడుదల చేసిన పియాజియో తాజాగా భారత మార్కెట్లో తమ సరికొత్త ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. కొత్త 2020 ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్ ఇప్పుడు ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లతో పాటు మరిన్ని కొత్త ఫీచర్లు, పరికరాలతో వస్తుంది. దీని డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు కూడా ఉన్నాయి.

ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

దేశీయ విపణిలో ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్ ధర రూ.91,321 ఎక్స్-షోరూమ్ (పూణే)గా నిర్ణయించారు. భారత 125సిసి ప్రీమియం స్కూటర్ విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలో ఆప్రిలియా స్టోర్మ్ 125 స్కూటర్ కూడా ఒకటి. ఇది షార్ప్ లైన్స్, స్పోర్టీ క్యారెక్టర్‌తో దేశంలోని యువ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త బిఎస్6 కంప్లైంట్ ఆప్రిలియా స్టోర్మ్ 125 ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు అనేక అదనపు ఫీచర్లతో వస్తుంది మరియు మునపటి వెర్షన్ కన్నా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. కొత్త స్కూటర్‌లోని కొన్ని ప్రధాన మార్పులను గమనిస్తే, ఇందులో మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ముందు భాగంలో 200 మిమీ వెంటిలేటెడ్ డిస్క్ ఉంటుంది. ఇది కాంబి-బ్రేకింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తుంది.

MOST READ:కరోనా నివారణ కోసం మరో కొత్త చర్య తీసుకుంటున్న జగన్ ప్రభుత్వం ; అదేంటో తెలుసా

ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇంకా ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, కొద్దిగా అప్‌డేట్ చేసిన బాడీ గ్రాఫిక్స్, వైబ్రాంట్ పెయింట్ స్కీమ్స్, పెద్ద 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి.

ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో ఇది వరకటి ఇంజన్‌నే బిఎస్6 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ఈ కొత్త బిఎస్ 6-కంప్లైంట్ 124.45 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 9.7 బిహెచ్‌పి శక్తిని మరియు 9.60 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. వెస్పా 125 సిరీస్ స్కూటర్లలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

MOST READ:భారత్ & అమెరికా మధ్య తిరిగి ప్రారంభం కానున్న ఫ్లైట్ సర్వీస్ ; ఎప్పటినుంచో తెలుసా ?

ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా పియాజియో ఇండియా ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డియాగో గ్రాఫి మాట్లాడుతూ, "మా ఐకానిక్ బ్రాండ్స్ వెస్పా మరియు ఆప్రిలియా నుండి రెండు కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది.

మా విలువైన కస్టమర్ల అనుభవాన్ని నిరంతరం పునర్నిర్వచించటం మరియు మెరుగుపరచడాని మేము నిబద్ధతతో వ్యవరిస్తాము."

ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

"వెస్పా బ్రాండ్ ప్రీమియం అనుభవాన్ని సృష్టించడానికి టెక్నాలజీ ఆధారిత ఫీచర్లను జోడించింది మరియు ఆప్రిలియా స్టోర్మ్ బ్రాండ్ అద్భుతమైన రైడింగ్ పనితీరును అందించడానికి మరియు కొత్త బెంచ్‌మార్క్‌లను రూపొందించడానికి మా టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తోంద"ని అన్నారు.

MOST READ:కొత్త 2020 వెస్పా స్కూటర్లు విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇటాలియన్ టూవీలర్ బ్రాండ్ పియాజియో భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన అనేక ఉత్పత్తులలో ఆప్రిలియా స్టోర్మ్ 125 కూడా ఒకటి. పియాజియో తమ ఆప్రిలియా స్టోర్మ్ 125తో పాటుగా కొత్త వెస్పా ఎస్ఎక్స్ఎల్ మరియు వెస్పా విఎక్స్ఎల్ సిరీస్ స్కూటర్లను కూడా విడుదల చేసింది. ఈ రెండు స్కూటర్లు 125 సిసి మరియు 150 సిసి వెర్షన్లలో మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఆప్రిలియా స్టోర్మ్ 125 స్కూటర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రీమియం 125 సిసి స్కూటర్ ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్ కూడా ఒకటి. ఇది ఈ విభాగంలో సుజుకి యాక్సెస్ 125 మరియు టివిఎస్ ఎన్-టార్క్ 125 వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

MOST READ:సూపర్ లుక్ లో ఉన్న మోడిఫైడ్ ఫోర్డ్ జీప్ [వీడియో]

Most Read Articles

English summary
Piaggio has introduced the Aprilia Storm 125 BS6 scooter in the Indian market. The new Aprilia Storm 125 BS6 scooter now comes with disc brakes at the front, along with a host of new features, equipment and other subtle changes. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X