కొత్త 2020 వెస్పా స్కూటర్లు విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

పియాజియో ఇండియా నేడు దేశీయ విపణిలో తమ రెండు పాపులర్ వెస్పా స్కూటర్లలో కొత్త 2020 వెర్షన్లను విడుదల చేసింది. వెస్పా ఎస్ఎక్స్ఎల్, వెస్పా విఎక్స్ఎల్ మోడళ్లను కంపెనీ విడుదల చేసింది. ఇవి రెండూ కూడా 125సీసీ, 150సీసీ ఇంజన్ సామర్థ్యాలతో మార్కెట్లో లభ్యం కానున్నాయి.

కొత్త 2020 వెస్పా స్కూటర్లు విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త వెస్పా స్కూటర్ రెండు ఇంజన్ ఆప్షన్లతో నాలుగు వేరియంట్లలో (ఎస్ఎక్స్ఎల్ 125, ఎస్ఎక్స్ఎల్ 150, విఎక్స్ఎల్ 125 మరియు విఎక్స్ఎల్ 150) లభ్యం కానుంది. మార్కెట్లో బేస్ వెరియంట్ వెస్పా ఎస్ఎక్స్ఎల్ 125 ప్రారంభ ధర రూ.1.10 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ వెస్పా విఎక్స్ఎల్ 150 ధర రూ.1.26 లక్షలుగా ఉంది.

కొత్త 2020 వెస్పా స్కూటర్లు విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇకపోతే, వెస్పా ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ.1.22 లక్షలు గాను మరియు వెస్పా విఎక్స్ఎల్ 125 ధర రూ.1.13 లక్షలు గాను ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

పియాజియో ఇప్పటికే తమ కొత్త బిఎస్6 కంప్లైంట్ వెస్పా స్కూటర్ల కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా సమీప డీలర్‌షిప్ కేంద్రాలలో తమ ఫేవరేట్ స్కూటర్‌ని బుక్ చేసుకోవచ్చు.

MOST READ:మోటార్ సైకిల్ లేని వ్యక్తి జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ కొనేసాడు, ఎలానో మీరే చూడండి

కొత్త 2020 వెస్పా స్కూటర్లు విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కాగా, పియాజియో తమ స్కూటర్ల కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వినియోగదారులకు రూ.2000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. కొత్త బిఎస్6 కంప్లైంట్ స్కూటర్ల డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

ఈ నాలుగు వెస్పా స్కూటర్లు పూర్తి లోడెడ్ ఫీచర్లు, పరికరాలతో లభిస్తాయి. వీటిలో క్రిస్టల్ ఇల్యూమినేషన్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లు మరియు హై-బీమ్, ఎల్‌ఈడి బూట్ లైట్, యూఎస్‌బి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, ఫుల్ స్టీల్ బాడీ మొదలైన ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2020 వెస్పా స్కూటర్లు విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, వెస్పా ఎస్ఎక్స్ఎల్ 125 మరియు వెస్పా విఎక్స్ఎల్ 125 స్కూటర్లలో 124.45 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 9.7 బిహెచ్‌పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.60 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:అద్భుతంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోని గ్యారేజ్ చూసారా..?

కొత్త 2020 వెస్పా స్కూటర్లు విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

అదేవిధంగా, వెస్పా ఎస్ఎక్స్ఎల్ 150 మరియు వెస్పా విఎక్స్ఎల్ 150 స్కూటర్లలో ఉపయోగించిన 149 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ గరిష్టంగా 7600 ఆర్‌పిఎమ్ వద్ద 10.30 బిహెచ్‌పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ నాలుగు స్కూటర్లలో ఒకే రకమైన సస్పెన్షన్ సెటప్‌ను ఉపయోగించారు. ఇందులో ముందు వైపు సింగిల్ సైడ్ ఆర్మ్ సస్పెన్షన్ సెటప్ మరియు వెనుక వైపు డ్యూయల్ షాక్-అబ్జార్బర్స్ ఉంటాయి.

కొత్త 2020 వెస్పా స్కూటర్లు విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ నాలుగు స్కూటర్ల ముందు భాగంలో ఒకే రకమైన 200 మి.మీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది సింగిల్-ఛానల్ ఏబిఎస్ లేదా కాంబి-బ్రేకింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తుంది. కాకపోతే వెనుక బ్రేక్‌లు మాత్రం వేరియంట్‌ను బట్టి మారుతాయి. వెనుక బ్రేక్‌లు వరుసగా 125 మరియు 150 సిసి వేరియంట్‌లకు 141 మి.మీ డ్రమ్స్ మరియు 143 మి.మీ. డ్రమ్‌లతో తయారు చేయబడ్డాయి.

ఈ నాలుగు స్కూటర్లు కూడా శక్తివంతమైన రంగుల ఎంపికలలో అందించబడతాయి. ఇందులో ఆరెంజ్, ఎల్లో, రెడ్, వైట్, బ్లూ, బ్లాక్ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

MOST READ: కారు పేపర్లు చూపమంటే రోడ్డు మీద పడి ఏడ్చిన అమ్మాయి : వీడియో

కొత్త 2020 వెస్పా స్కూటర్లు విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2020 వెస్పా ఫేస్‌లిఫ్ట్ బిఎస్6 స్కూటర్ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

వెస్పా ఎస్ఎక్స్ఎల్ మరియు వెస్పా విఎక్స్ఎల్ శ్రేణి స్కూటర్లు భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క ప్రీమియం మోడళ్లు. ఈ రెండు మోడళ్లు కూడా 125 సిసి మరియు 150 సిసి ఇంజన్ ఆప్షన్లతో మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ అవసరానికి అనుగుణంగా ఇవి లభిస్తున్నాయి. ఈ కొత్త స్కూటర్లు ఈ విభాగంలో సుజుకి యాక్సెస్ 125 మరియు సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తాయి.

Most Read Articles

Read more on: #వెస్పా #vespa
English summary
Piaggio has rolled out a number of new vehicles in the Indian market, including the launch of the updated BS6-compliant Vespa SXL and VXL scooter range. The two new scooters are available in both 125cc and 150cc variants. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X