Just In
- 50 min ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 1 hr ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 2 hrs ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 16 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
నాన్సీ ల్యాప్‌టాప్ చోరీ? రష్యా ఇంటలిజెన్స్‌కు చేరవేసే ప్లాన్.. ఎఫ్‌బీఐ అఫిడవిట్లో సంచలనాలు..
- Sports
వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు.. ధోనీ కన్నా వేగంగా!!
- Finance
Gold prices today : స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు జంప్
- Lifestyle
మీరు ఎప్పుడూ ఎందుకు అలసిపోతున్నారు?అందుకు సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి..
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోండా గ్రాజియా 125 స్కూటర్ కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ ఆఫర్; ఎంతో తెలుసా?
హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎమ్ఎస్‌ఐ) లిమిటెడ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న 125సీసీ స్కూటర్ హోండా గ్రాజియాపై కంపెనీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ స్కూటర్ కొనుగోలుపై కస్టమర్లు ఇప్పుడు 5 శాతం వరకూ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం, గ్రాజియా 125 స్కూటర్‌ను క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ స్కీమ్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే ఈ 5 శాతం క్యాష్‌బ్యాక్ (గరిష్టంగా రూ.5,000 వరకు) ఆఫర్ లభిస్తుంది.

గ్రాజియా స్కూటర్‌ను కొనుగోలు చేయటానికి ఇదొక సులువైన ఈఎమ్ఐ విధాన మరియు ఈ ఫైనాన్స్ పథకానికి ఎలాంటి అదనపు డాక్యుమెంటేషన్ అవసరం లేదు. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేసిన వాహనాన్ని బ్యాంకుతో హైపోథెకేట్ చేయవలసిన అవసరం కూడా ఉండదు.
MOST READ:సినిమా స్టైల్‌లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

అంతేకాకుండా, ఈ పథకం ద్వారా కొనుగోలు చేయటానికి ఎలాంటి ముందస్తు డౌన్‌పేమెంట్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కార్డ్-ఆధారిత ఈఎమ్ఐ ఆఫర్ కోసం హోండా ద్విచక్ర వాహన విభాగం, దేశంలోని ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలు మరియు బ్యాంకులతో ఒప్పందాలను కలిగి ఉంది.

ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందించే బ్యాంకులు మరియు ఫైనాన్స్ కంపెనీల జాబితాలో ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ మరియు ఫెడరల్ బ్యాంక్‌లు ఉన్నాయి.
MOST READ:నిజంగా ఈ బైకర్స్ అదృష్టవంతులే సుమీ.. ఎందుకో వీడియో చూడండి

ఇక హోండా గ్రాజియా 125 స్కూటర్ విషయానికి వస్తే, ఈ ఏడాది జూన్ నెలలో, ఇందులో కొత్త బిఎస్6 వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేశారు. ఆ సమయంలో కంపెనీ దీనిలో ఇంజన్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా ఫీచర్లను కూడా అప్‌డేట్ చేసింది.

భారత మార్కెట్లో హోండా గ్రాజియా 125 స్టాండర్డ్ మరియు డీలక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విపణిలో స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.73,912 గా ఉంటే డీలక్స్ వేరియంట్ ధర రూ.80,978గా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).
MOST READ:మళ్ళీ బయటపడిన లంచం తీసుకుంటూ దొరికిన పోలీస్ వీడియో.. మీరు చూసారా ?

ఈ బిఎస్6 స్కూటర్‌లో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్, స్ప్లిట్ ఎల్‌ఈడి పొజిషన్ లాంప్స్, మల్టీ-ఫంక్షన్ స్విచ్, ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ స్విచ్, ఇంటిగ్రేటెడ్ హెడ్‌ల్యాంప్ బీమ్ మరియు పాసింగ్ స్విచ్, ఇంజిన్-కట్ ఆఫ్ ఫంక్షన్‌తో కూడిన సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 125సిసి, పిజిఎమ్-ఎఫ్ఐ హెచ్ఇటి (హోండా ఈకో టెక్నాలజీ) ఇంజన్ ఉంటుది. ఇది గరిష్టంగా 8.14 బిహెచ్‌పి పవర్‌ను మరియు 10.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాట్ సైబర్ ఎల్లో, పెరల్ స్పార్టన్ రెడ్, పెరల్ సైరన్ బ్లూ మరియు మ్యాట్ యాక్సిస్ గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

హోండా హెచ్‌నెస్ సిబి 350పై క్యాష్‌బ్యాక్ ఆఫర్
హోండా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన తమ ప్రీమయం మోటార్‌సైకిల్ హోండా హెచ్‌నెస్ సిబి 350పై కూడా కంపెనీ ఇదే తరహా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌ను క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ ఫైనాన్స్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లు రూ.5,000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.